అమ్మాయిలని ఫ్లడ్‌ చేయడానికి ఈ షో కి వచ్చావా.. రైతు బిడ్డపై ఫైర్ అయిన శోభా శెట్టి..!

బిగ్‌బాస్ 7 సోమవారం నామినేషన్ ఎపిసోడ్ మంగళవారం వరకు కొనసాగింది. రైతు బిడ్డ ఒక్కడిని చేసి అమర్ దీప్ అండ్ కో సీరియల్ బ్యాచ్ బాగా ఆడుకున్నారు. 10వ ఎపిసోడ్ లో మన మౌనిత అయితే.. తెగ రెచ్చిపోయింది. నువ్వు ఇక్కడికి దేని కోసం వచ్చావ్.. కానీ నువ్వు చేస్తున్న పని ఏంటి అని ఇష్టం వచ్చినట్లు మాటలనేసింది. ప్రశాంత్ ఏమి మాట్లాడకుండా అలాగే ఉన్నాడు.

 

శోభ శెట్టి మళ్లీ మొదలు పెట్టి అయిన నీలో రెండు యాంగిల్స్ కనిపిస్తున్నాయి. రతిక వెనుక ఎందుకు పడుతున్నావ్? టైటిల్ కోసమే వచ్చావా? అమ్మాయిల్ని లవ్ చేయడానికి వచ్చావా? అంటూ రైతు బిడ్డ పరువు మొత్తం తీసేసింది.

ఈ మాటకి ప్రశాంత్..” రతిక నేను నిన్ను లవ్ చేస్తున్నానని ఎప్పుడన్నా చెప్పానా? అని అడిగాడు ప్రశాంత్. అప్పుడు రతిక పాప రియాక్ట్ అయ్యి..’ హౌస్లో ఉన్న వాళ్లు అంతా పిచ్చోళ్లు కాదు.. అందరికీ తెలుసు ‘ అని అన్నది. అసలు ఆమెకు మాట్లాడటం వచ్చా? రాదా? ఒక టాపిక్ గురించి మాట్లాడి మళ్లీ సంబంధం లేకుండా వేరే దాని గురించి మాట్లాడుతుందేంటి అంటు ర‌తిక పై ప్రేక్షకులు మండిపడుతున్నారు.