ధృవ సర్జ కన్నడ స్టార్ హీరో.. టాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జకు మేనల్లుడు. ధృవ సర్జకు కన్నడ సినీ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్వర్గీయ చిరంజీవి సర్జాకు తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల ఆయన చేసిన ఓ పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుంటూ ధృవ సర్జ తన భార్యకి సీమంతం వేడుకలు జరిపిన విధానం కన్నడ ఇండస్ట్రీలోనే కాక ప్రస్తుతం సోషల్ మీడియాలో అంతా చర్చినీయ అంశంగా మారింది.
అసలు విషయానికి వస్తే ధృవ సర్జ అన్న చిరంజీవి సర్జ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అయితే ధృవ సర్జ భార్య ప్రేరణ ప్రస్తుతం గర్భంతో ఉంది. ఈ శుభ సమయంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుంటూ ఆమెకు సీమంత వేడుకలు ఘనంగా జరిపాడు ధృవ సర్జ. ఈ వేడుకల చిరంజీవి సజ్జ సమాధి ఉన్న ఫామ్ హౌస్ లో నిర్వహించడం గమనార్హం. శ్రీకృష్ణ జన్మాష్టమి చిన్నారులు కృష్ణుడి వేషం ధరించి ఉత్సాహంతో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ధృవ తన ఇన్‌స్టా ఎకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫార్మ్ హౌస్ మొత్తం రకరకాల అందమైన పూలతో అలంకరించి వేడుకను చేశారు.
ధ్రువ సర్జ సోదరుడు చిరంజీవి సర్జ మరణంతో ఇంకా కుటుంబం అంతా బాధలోనే ఉంది. ధ్రువ సర్జ ఇంట్లో జరిగే కార్యక్రమంలో చిరు జ్ఞాపకం గా ఉండాలని శ్రీమంత వేడుకలను చిరు సర్జ సమాధి ఉన్న ఫార్మ్ హౌస్ లో చేశారు. దీంతో ప్రత్యేకంగా అన్నపై ఉన్న ప్రేమను ధృవ సర్జ చాటుకున్నాడు. ఈ కార్యక్రమానికి ధృవ సర్జ తల్లిదండ్రులతో పాటు స్నేహితులు, బంధువులు హాజరై సందడి చేశారు. ఇక ధృవ 2019లో ప్రేరణను వివాహం చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ధృవ 2022 అక్టోబర్లో ఆడపిల్లకు జన్మనిచ్చాడు. ప్రస్తుతం ఈ జంట మరో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ధృవ సర్జ ప్రస్తుతం కేడి, మార్టిన్ సినిమాల్లో నటిస్తున్నాడు.
View this post on Instagram