తెగించేసిన నిహారిక‌.. ప్యాంట్ లేకుండా కెమెరా ముందుకొచ్చి ర‌చ్చ చేసిన మెగా డాట‌ర్!

నిహారిక.. మెగా ఫ్యామిలీ నుంచి ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏకైక హీరోయిన్. నాగబాబు కూతురు అయిన నిహారిక.. యాంకర్ కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. నటిగా సక్సెస్ అవ్వకముందే పెళ్లి పీటలు ఎక్కింది. జొన్నలగడ్డ చైతన్యతో ఏడడుగులు వేసింది. 2020లో వీరి వివాహం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది.

కానీ నిహారిక చైతన్య వైవాహిక బంధం ఎక్కువ కాలం సాగలేదు. ఈ ఏడాది మే నెలలో వీరిద్దరూ విడాకులు తీసుకుని.. ఎవరి దారి వారు చూసుకున్నారు. విడాకుల అనంత‌రం నిహారిక నిర్మాతగా, నటిగా బిజీ అవుతోంది. అలాగే ఫ్రెండ్స్ తో , ఫ్యామిలీతో బ్యాక్ టు బ్యాక్ వెకేష‌న్స్ కు వెళ్తూ ఫుల్ గా చిల్ అవుతోంది. మ‌రోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తరచూ గ్లామరస్ ఫోటో షూట్లతో వార్త‌ల్లో నిలుస్తోంది.

హద్దులు దాటుతూ అందాలు ఆరబోస్తోంది. తాజాగా మరోసారి తెగించేసింది. ప్యాంటు లేకుండా కెమెరా ముందుకు రచ్చ చేసింది. నిహారిక లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మెగా ఫాన్స్ మాత్రం నిహారిక తీరును తప్పుపడుతూ ట్రోల్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ ప‌రువు తియ్య‌డానికి.. ఇలాంటి ప‌నికి మాలిన ప‌నులు చేస్తున్నావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)