టైగర్ బిజినెస్ ఆల్మోస్ట్ క్లోజ్.. కోట్ల‌లో లాభం..!!

ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న మూవీ టైగర్ నాగేశ్వరరావు. అభిషేక అగర్వాల్ బ్యానర్స్ లో నిర్మిస్తున్న ఈ సినిమాను స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెల 20న ప్రేక్షకుల ముందు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కాస్త భారీగానే బిజినెస్ జరిగింది. నాన్ ధియేటర్ కింద ఇంకా సాటిలైట్ కాకుండానే రూ.49 కోట్లు వచ్చినట్లు సమాచారం. థియేటర్ బిజినెస్ ను కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు. ఓవర్సీస్ కర్ణాటక మినహా మిగిలిన ఏరియాల్లో అన్ని డీల్స్ క్లోజ్ అయిపోయాయి.

ఆంధ్ర రైట్స్‌ హోల్ సేల్‌గా రూ.17 కోట్లకు ఉషా పిక్చర్ కు ఇచ్చేశారు. సీడెడ్ ను రూ.5.40 కోట్లకు ఇచ్చారు. నైజం మాత్రం రూ.9 కోట్ల అడ్వాన్స్ మీద డిస్ట్రిబ్యూష‌న్‌కి ఏషియన్ సినిమాస్ వాళ్ళ‌కి ఇచ్చారు. మొత్తం మీద చూసుకుంటే దాదాపు రూ.80 కోట్లకు పైగా ఈ సినిమా బిజినెస్ జరిగింది. సినిమాకు కాస్త భారీగానే ఖర్చయిందట. హీరో రెమ్యూనరేషన్ కాకుండా రూ.50 కోట్లకు పైగా నిర్మాణ వ్యయం అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మొత్తం మీద ఈ సినిమాకు మంచి టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లే అనుకోవాలి.

దాదాపు ఈ సినిమాకి ఇప్ప‌టికే రూ.15కోట్లు వ‌చ్చాయి. ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. సీజీ పనులు మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఇక దసరా సీజన్‌లో విజ‌య్‌.. లియో, బాల‌య్య భగవంత్ కేసరి సినిమాలతో పోటీ పడుతూ టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.