టాలీవుడ్ యంగ్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ ఎంత మంది స్నేహితులు అందరికీ తెలిసిందే. వీరు సొంత అన్నదమ్ముల్లా ఉంటారు అనే విషయం ఈమధ్య వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా చూస్తే అర్థమవుతుంది. అయితే వీరిద్దరూ మంచి స్నేహితులే కాకుండా నటన పరంగా కూడా మంచి టాలెంట్ ఉన్న హీరోలు. ఒక్క నటన అనే కాకుండా ఎదుటివారికి గౌరవించే విషయంలో కూడా చరణ్, ఎన్టీఆర్ ఏమాత్రం తగ్గరు.
ఆ రకంగా వారిద్దరికీ చాలా కామన్ పాయింట్స్ ఉండటంతో వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే ప్రేక్షకులకు నచ్చుతుందనే ఉదేశ్యంతో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా తీసుంటాడు. ఇక రాజమౌళి ఉహించిన విధంగానే ఆర్ ఆర్ ఆర్ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా చరణ్, ఎన్టీఆర్ లకి గ్లోబల్ స్టార్స్ అనే ట్యాగ్ కూడా వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చరణ్, ఎన్టీఆర్ లకి ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను ఎన్నో సార్లు బయటపెట్టారు. ఈ క్రమంలోనే చరణ్ పుట్టినరోజు రోజు వారిద్దరూ బయటకు వెళ్లి చేసే సందడి గురించి కూడా ఎన్టీఆర్ పలు సందర్భాలో చెప్పాడు. అలా చరణ్ అంటే తనకు చాలా ఇష్టం అని, అతనే తన ప్రాణ స్నేహితుడు అని ఎన్టీఆర్ చెప్పాడు.
కానీ ఒక విషయంలో మాత్రం చరణ్ అంటే ఎన్టీఆర్ కి ఇష్టం లేదు అని తెలిపాడు. ఎన్టీఆర్, చరణ్ గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే ‘ ఎన్టీఆర్ ఎవరితో అయిన ముక్కుసూటిగా ఉంటాడట. కానీ చరణ్ మాత్రం ఎదుటివాళ్ళతో మాట్లాడాలన్న, ఏదయినా చెప్పలనా చాలా ఆలోచిస్తాడట. అలా తన అభిప్రాయాన్ని బయట పెట్టకుండా చరణ్ తనలో తానే బాధపడుతూ ఉంటాడు అని ఎన్టీఆర్ తెలిపాడు. అలా ఉండకూడదని మంచైనా చెడైనా ఎదుటివారితో పంచుకుంటే బాధ తగ్గుతుందని ఎన్నిసార్లు చెప్పినా చరణ్ మారట్లేదు. అ ఒక్క విషయం నాకు చరణ్ లో నచ్చదు అంటూ ఎన్టీఆర్ పేర్కొన్నాడు’. ఈ రకంగా ఎన్టీఆర్, చరణ్ గురించి మాట్లాడం కాస్త వైరల్ గా మారింది.