పాపం శ్రీ లీలకు ఎంత పెద్ద కష్టం వచ్చింది..!

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ ఎనర్జిటిక్ బ్యూటీగా శ్రీలలా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ మంచి పాపులారిటీ తెచ్చుకున్న‌ ఈ ముద్దుగుమ్మ పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా తరువాత శ్రీ లీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మూవీ ఆదికేశవ.. వైష్ణవ తేజ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కాకుండా రెండుసార్లు పోస్ట్ పొన్ అయింది.

శ్రీ లీల కెరీర్ స్టార్టింగ్ లో నటించిన ఈ సినిమా ఇప్పటివరకు రిలీజ్ కాకపోవడంతో శ్రీ‌లీలకు పెద్ద కష్టం వచ్చిందని చెప్పాలి. ఈ సినిమా ఇప్పటివరకు రిలీజ్ కాకపోవడానికి కారణం ప్రాజెక్ట్ అనుకున్న విధంగా రాకపోవడమేనని గుసగుసలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమా కోసం దర్శకుడు సుధీర్ వర్మ సీన్ లోకి ఎంటర్ అయినట్లు తెలుస్తుంది. శిష్యుడు దర్శకత్వంలో సినిమా.. అటు మిత్రుడు నాగవంశీ నిర్మించే సినిమా కావడంతో అంతకుమించి ప్రస్తుతం సుదీర్ వర్మ ఖాళీగానే ఉండడంతో ఆదికేశవ మీద సుధీర్ వర్మ ఫోకస్ పెట్టాడట.

ఇప్పటికే విదేశాల్లో చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా నేతృత్వం సుధీర్ వర్మ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కొన్ని సీన్లు కూడా సుదీర్ వర్మ రీషూట్ ప్లాన్ చేశాడట. ఇక ప్రస్తుతం నవంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు శ్రీ‌లీల‌నే మెయిన్‌ అట్రాక్షన్. ఎందుకంటే హీరో వైష్ణవ తేజ్ హిట్ కొట్టి చాలా కాలం అయింది. ప్రస్తుతం ఫామ్ లో లేని వైష్ణవ తేజ్ సినిమాలో శ్రీ లీలా హీరోయిన్ గా ఉండడంతోనే సినిమా కొద్దిగా హైప్ ఉంది. ఇక ఈ సినిమా రిలీజై ప్రేక్ష‌కుల‌లో ఎలాంటి టాక్ సంపాదిస్తుందో చూడాలి.