నక్క తోక తొక్కిన నవీన్ పోలిశెట్టి.. స్టార్ హీరోల కంటే ఎక్కువ క్రేజ్..

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ‘ అనే సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నవీన్ పోలిశెట్టి ‘జాతిరత్నాలు’ సినిమా తో బాగా ఫేమస్ అయ్యాడు. పదేళ్ళ క్రితమే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నవీన్ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాడు. మరి నవీన్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సినిమా తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన నవీన్ కెరీర్ కి ఆ సినిమా పెద్దగా యూస్ అవ్వలేదు.

అందుకే యూట్యూబ్ వీడియోలతో పాన్ ఇండియా స్టార్ అయిపోయ్యాడు. ‘ చిచోరే ‘ అనే సినిమా తో నార్త్ ఆడియన్స్ కి దెగ్గరయ్యాడు. ఇక ఆ తరువాత ‘ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ‘ సినిమా తో తెలుగు లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమా కి సంబందించిన కథ, స్క్రీన్ ప్లే మొత్తం నవీన్ ఏ రాసుకున్నాడు. ఇక జాగ్రత్తగా సినిమాతో తనకున్న ట్రేస్ ని డబల్ చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నవీన్ తాజాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసాడు.

మహేష్ బాబు. పి దర్శకత్వం వహించిన ఈ సినిమా లో నవీన్ పోలిశెట్టి సరసన స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించింది. ఇటీవల ఈ సినిమా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నవీన్ కామెడీ నే ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అతని కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించ్చాడు నవీన్ పోలిశెట్టి. కాస్త లేట్ అయినా కూడా మంచి స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకొని విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి ‘ అనగనగ ఒకరాజు ‘ అనే సినిమాలో నటిస్తున్నాడు. అలానే మరో రెండు మూడు ప్రాజెక్ట్ కి ఓకే చెప్పి బిజీ గా ఉన్నాడు.