బిగ్ బాస్ 7 శుభశ్రీ గురించి బయటపడ్డ అసలు నిజం ఇదే.. తెలిస్తే షాక్..!

బిగ్ బాస్ 7 హౌస్ లోకి 5 వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన శుభశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమె టాలెంటుకు అసలు కొదవేలేదు. హౌస్ లో ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటూ ఫాలోవర్స్ సంఖ్య పెంచుకుంటూ పోతుంది. ఇక ఈమె గురించి తాజాగా ఒక అసలు నిజం బయటపడడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి లాయర్ వృత్తి ని చేపట్టిన ఈమె లాయర్ గానే హౌస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక హౌస్ లో ఉన్నంత సేపు కూడా పర్ఫెక్ట్ పాయింట్స్ బయటికి తీస్తూ నామినేషన్స్ లో చాలా చక్కగా తెలివిగా కంటెస్టెంట్లను నామినేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అందరూ ఈమె గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈమె గురించి ఈమె బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా మందికి తెలియదని చెప్పాలి.

శుభశ్రీ అసలు పేరు శుభ శ్రీ రాయగురు. 1997 జూలై 15న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది.ఇక ఈమె తల్లిదండ్రులు ముంబై కి చెందినవారు. అయితే వృత్తిరీత్యా బెంగళూరులో సెటిల్ కావడంతో ఈమె కూడా అక్కడే జన్మించారు. బెంగళూరులో స్కూల్ చదువు పూర్తయ్యాక ముంబైలో లా పూర్తి చేసింది శుభశ్రీ. ఇక ఈమెకి ఆటలు అంటే చాలా ఇష్టంబ్యాట్మింటన్ లో మంచి ప్రవేశం కూడా ఉంది. మంచి క్లాసికల్ డాన్సర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్న ఈమె పలు ప్రదర్శనలు కూడా ఇచ్చింది. అంతేకాదు కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా ఎప్పుడూ ముందుండే శుభశ్రీ 2020 ఫెమినా మిస్ ఇండియా ఒడిషా గా ఎంపిక అయ్యింది.

ఇక ఈమె తల్లి పేరు విజయలక్ష్మి.. తండ్రి పేరు రమేష్ చంద్ర .. ఈమెకు ఒక తమ్ముడు, చెల్లెలు కూడా ఉన్నారు. ఇక శుభశ్రీ దాదాపు 3 వేలకు పైగా షోలకు యాంకర్ గా వ్యవహరించి.. 2022లో చిరంజీవి ఓల్డ్ టైటిల్ రుద్రవీణ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కథ వెనుక కథ, అమీగోస్ సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే అంతకుముందు 2016లో అ అనే సినిమాతో పాటు తమిళంలో ఉట్రన్ అనే సినిమాలో కూడా నటించింది. అంతేకాదు హిందీలో ఒకటి రెండు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేసిన శుభశ్రీ, 2023లో బెస్ట్ యాక్ట్రేస్ గా ఒక ప్రైవేట్ సంస్థ అందించే దాదాసాహెబ్ ఫాల్కే ఎక్స్ లెన్స్ అవార్డును కూడా దక్కించుకుంది.