చిరంజీవి ఠాగూర్ మానియాలో కొట్టుకుపోయిన తెలుగు మూవీలు ఏంటో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాప్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇంద్ర మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టి అభిమానుల ఆకలి తెచ్చిన మెగాస్టార్ ఆ తర్వాత వివి వినాయక్ డైరెక్షన్లో ఠాగూర్ మూవీ నటించిన సంగతి తెలిసిందే. 2003 సెప్టెంబర్ 24న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని సూపర్ హిట్ గా నిలిచింది. ఓ అభిమాన దర్శకుడు తన అభిమాన హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో ప్రూవ్ చేశాడు వినాయక్.

తమిళంలో మురుగదాస్ తరుకెక్కించిన ‘ రమణ ‘ చిత్రానికి రీమేక్ గా ఇది వచ్చినా.. ఈ సినిమాకు దానికి మధ్య చాలా మార్పులు కనిపిస్తాయి. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా ఠాగూర్ లో చాలా మార్పులు చేశాడు డైరెక్టర్. క్లైమాక్స్ అయితే పూర్తిగా మార్చేశాడు. దీంతో ఈ సినిమా అసలు రీమేక్ లాగే అనిపించదు. నిజానికి వినాయక్ చేసిన ఈ మార్పులే ఠాగూర్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం అయ్యాయి. ఇక ఇటీవల 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా అప్పట్లో కొన్ని క్రేజీ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి పరోక్షంగా కారణమయ్యింది. అవేంటో ఒకసారి చూద్దాం.

మంచు విష్ణు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘ విష్ణు ‘ మూవీ ఠాగూర్ రిలీజ్ అయిన నాలుగు రోజులకి సెప్టెంబర్ 28న రెలజై ఫ్లాప్ అయింది. ఆ తర్వాత తరుణ్ – శ్రేయా కాంబోలో వచ్చిన మూవీ ‘ ఎలా చెప్పను ‘ కళ్యాణ్ రామ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ వచ్చిన ‘ తొలిచూపులోనే ‘ దివంగత స్టార్ కమెడియన్ ఏవీఎస్ డైరెక్షన్లో వచ్చిన ‘ ఓరి నీ ప్రేమ బంగారం కాను ‘ ఈ సినిమాలు అన్ని టాగూర్ బాక్సాఫీస్ మేనియాలో పడి ఫ్లాప్ అయ్యాయి.