హీరోయిన్ రాశి కి ఆ స్టార్ హీరో తో సంబంధం ఏంటి..?

సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు సక్సెస్ఫుల్ కొనసాగించాలి అంటే చాలా కష్టతరమని చెప్పవచ్చు. ఒకసారి స్టార్ డం వచ్చిందంటే చాలు ఆటోమేటిగ్గా స్టార్ క్రేజ్ ను అందుకుంటూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరమో చెప్పలేము. అలా ఇప్పటివరకు ఎంతోమంది నటీనటులు ఒక్క సినిమాతో స్టార్టంలో అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో అలనాటి హీరో తొట్టెంపూడి వేణు కూడా ఒకరిని చెప్పవచ్చు.

ఈ హీరో నటించిన ఎన్నో చిత్రాలు వరుసగా విజయాలు అందుకున్నాయి మొదట స్వయంవరం అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తొట్టెంపూడి వేణు ఆ తర్వాత హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే, చిరునవ్వుతో, తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. స్వయంవరం సినిమా తర్వాత తొట్టెంపూడి వేణు నటించిన మనసు పడ్డాను కానీ అనే సినిమా చేస్తున్న సమయంలో హీరోయిన్ రాశికి, వేణుకి మధ్య మంచి సంబంధం ఏర్పడినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.

అయితే దీనివల్ల అప్పుడప్పుడు వీరు కలుస్తూ కనిపిస్తూ ఉండేవారని సమాచారం. దీంతో రాశికి వేణుకి మధ్య ఏదో రిలేషన్ ఉందని రూమర్స్ కూడా వినిపించాయి. ఈ విషయం పైన వీరిద్దరూ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది కేవలం మా ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉందంటూ తెలియజేశారు. మరి ప్రస్తుత పరిస్థితులలో ఒకరినొకరు కలుసుకొని మాట్లాడుకుంటున్నారా లేదా అనే విషయం మాత్రం తెలియదు కానీ అప్పట్లో వీరిద్దరి గురించి పలు రకాల వార్తలయితే వినిపించాయి. ఇప్పుడు రాశి బుల్లితెర పైన సీరియల్స్ లో నటిస్తూ ఉండగా తొట్టెంపూడి వేణు ఇటీవలే అతిధి అనే వెబ్ సిరీస్ తో మంచి విజయాన్ని అందుకున్నారు.