ఉస్తాద్ సినిమాలో విలన్ గా ఆ స్టార్ డైరెక్టర్..!!

డైరెక్టర్ హరి శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈనెలఖరి వరకు ఈ సినిమా షెడ్యూల్ ని మిస్ చేయకుండా కొన్ని కీలకమైన సన్నివేశాలు తీయబోతున్నట్లు సమాచారం ఆ తర్వాత పవన్ లేకుండా కొన్ని సీన్స్ తీసే ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. మాస్ ఆడియన్స్ ని సైత మెప్పించే విధంగా డైరెక్టర్ హరిశంకర్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరికొత్త క్యారెక్టర్లో చూపించబోతున్నారు.

Actor R Parthiban OPTS OUT of Mani Ratnam's Ponniyin Selvan; Here's Why |  PINKVILLA

అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను ఎదుర్కోబోయే విలన్ గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటివరకు చిత్ర బృందం విలన్ గురించి ఎటువంటి హింట్ ఇవ్వకపోయినా ఇందులో విలన్ గా ఎవరు కనిపించబోతున్నారు అనే విషయం వైరల్ గా మారుతోంది .గబ్బర్ సింగ్ సినిమా కోసం అభిమన్య సింగ్ ను తీసుకువచ్చిన డైరెక్టర్ ఈసారి ఉస్తాద్ చిత్రం కోసం మరొక డైరెక్టర్ ని తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఆయన ఎవరో కాదు తమిళ డైరెక్టర్ యాక్టర్ R పార్తిబన్.

Pawan Kalyan and Harish Shankar's 'Ustaad Bhagat Singh' gears up for a  massive shooting schedule | Telugu Movie News - Times of India

విలన్ పాత్రలో డిఫరెంట్ గా చూపించబోతున్నట్లు సమాచారం. ఈయన తమిళంలో డైరెక్టర్ గా నటుడుగా ఎన్నో సంవత్సరాల నుంచి రాణిస్తున్నారు తెలుగులో ఈయన చేసినవి తక్కువ సినిమాలే అప్పట్లో రామ్ చరణ్ నటించిన రచ్చ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో రాంచరణ్ తండ్రిగా కనిపించారు. అలాగే యుగానికి ఒక్కడు సినిమాలో చోళ రాజుగా కనిపించారు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయం పైన అధికారికంగా చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.