పచ్చిమిర్చి ఎక్కువగా తింటే కలిగే నష్టాలు ఇవే..!!

మనం నిత్యం ఆహారంగా తీసుకొనే అనేక రకాల వంటలలో కచ్చితంగా పచ్చిమిర్చి ఉండనే ఉంటుంది. ఈ పచ్చిమిర్చి లేనిదే మనం ఎలాంటి వంటకం చేయలేము. పచ్చిమిర్చి వంటకాలకు ప్రత్యేకమైన రుచి కూడా ఇస్తుంది.ఇంకా పచ్చిమిర్చిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుందని చెప్పవచ్చు. ఇలా మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఇందులో చాలా పుష్కలంగా లభిస్తాయి. అయితే పచ్చిమిర్చిని అధిక మోతాదులో తీసుకున్న వారికి అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయట.. వీటి గురించి నిపుణులు తెలియజేస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.

పచ్చిమిర్చిలలో క్యాప్సికం అనే సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది వీటిని ఎక్కువగా తినడం వల్ల ప్రేగులలో కచ్చితంగా నొప్పి వచ్చే అవకాశం ఉంటుందట. అలాగే రక్తపోటు కూడా పెరిగిపోతుందట. వీటితోపాటు మన కడుపులో ఉండే పోలిక్ యాసిడ్ స్థాయిలు కూడా విపరీతంగా పెరిగిపోతాయట. అలాగె మన శరీరం అంతా కూడా వేడి పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. దీనివల్ల నిద్రలేని సమస్యతో పాటు మానసికమైన సమస్యలు కూడా ఎదురవుతాయి.

ముఖ్యంగా ఒత్తిడి ఆందోళన వంటివి పెరుగుతూ ఉంటాయి పచ్చిమిర్చి అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య కూడా పెరుగుతుంది. వీటితోపాటు కడుపులో పుండ్లు కూడా ఏర్పడతాయి. ఇంక విరోచనాల సమస్యతో కూడా ఇబ్బంది పడవలసి ఉంటుందట. TB రోగులు పచ్చిమిర్చికి చాలా దూరంగా ఉండాలి.. ఈ రోగులను మరింత అనారోగ్యానికి గురయ్యేలా చేస్తుందట. అందుకే పచ్చిమిర్చిని మితిమీరి తీసుకోకూడదని నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా పలు రకాల అనారోగ్య సమస్యల బారిన కూడా పడే అవకాశం ఉన్నది. అవసరమైన మోతాదులలో మాత్రమే పచ్చిమిర్చిని వేసుకోవడం మంచిది.