మైనర్ పాస్ పోర్ట్ అప్లై చేయాలా…. అయితే సింపుల్ విధానం ఇదే….!!

ఆధునిక కాలంలో చాలామంది విదేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లడానికి ప్రతి ఒక్కరు తప్పకుండా పాస్పోర్ట్ కలిగి ఉండాలి. ఆఖరికి పిల్లలను తీసుకువెళ్లాలన్నా తప్పకుండా మైనర్ పాస్పోర్ట్ తీసుకోవాల్సిందే. ఈ కథనంలో మేజర్ పాస్పోర్ట్ ఎలా తీసుకోవాలి? దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పిల్లల కోసం పాస్పోర్ట్ పొందాలనుకుంటున్నవారు ఆన్లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న 7 నుంచి 15 రోజుల లోపల ఇంటికి వస్తుంది.

మైనర్ పాస్పోర్ట్ కోసం అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్:

* జనన ధృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్)

* ఆధార్ కార్డ్ లేదా తల్లిదండ్రుల అడ్రస్ ప్రూఫ్

* తల్లిదండ్రుల పాస్పోర్ట్స్ ( అందుబాటులో ఉంటే)

* తల్లిదండ్రుల జాతీయతకు సంబంధించిన ప్రూఫ్ ( పిల్లలు భారతదేశం వెలుపల జీవించినట్లు అయితే)

ఆన్లైన్లో అప్లై చేయడం ఎలా:

* మైనర్ పాస్పోర్ట్ సేవ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి… లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి.

* అప్లికేషన్ ఫారమ్ పూర్తిగా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.

* ఆ తర్వాత దానికయ్యే అమోంట్ చెల్లించాల్సి ఉంటుంది.

* అమౌంట్ చెల్లించిన తరువాత పాస్పోర్ట్ సేవా కేంద్రంలో అపాయింట్మెంట్ షెడ్యూల్ చెయ్యాలి.

* మీరు అపాయింట్మెంట్ సమయంలో అప్లికేషన్ ఫారమ్, ఫీజు చెల్లించిన రసీదు వంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్లాలి.

* అపాయింట్మెంట్ రోజు మీ బిడ్డను పాస్పోర్ట్ సేవా కేంద్రానికి తీసుకెళ్లాలి.

* పాస్పోర్ట్ అధికారి మీ అప్లికేషన్ అండ్ డాక్యుమెంట్లను పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకుంటే. ఆ తర్వాత పాస్ పోర్ట్ ప్రాసెస్ జరుగుతుంది.

* అప్లికేషన్స్ సబ్మిట్ చేసిన తరువాత మీకు అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ లభిస్తుంది. దీని ద్వారా పాస్పోర్ట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

* అప్లికేషన్ సిద్ధమైన తరువాత మీరు వ్యక్తిగతంగా చేసుకోవచ్చు. లేదా మీ చిరునామాకు డెలివరీ చేసుకోవచ్చు.