ప్రతి చిన్న విషయాన్ని మర్చిపోతున్నారా..? అయితే మీకు ఆ వ్యాది ఉన్నట్లే..

ఇటీవల కాలంలో చాలామంది చిన్న చిన్న విషయాలను త్వరగా మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. ఒకటో రెండో విషయాలు మర్చిపోతే పర్వాలేదు. అయితే చిన్న చిన్న విషయాలు కూడా తరచుగా మరిచిపోతే మాత్రం కొంచెం ఆలోచించాలి. ఉదాహరణకు వ్యక్తుల పేర్లు, ఫోన్ లేదా ఇంటి తాళం ఎక్కడ పెట్టారు, భోజనం చేశారా లేదా లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీరు గుర్తుంచుకోలేకపోతే మీరు దీని గురించి తప్పక తెలుసుకోవాలి. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్ది మతిమరుపు కామన్ గానే ఉంటుంది. చాలామందికి ఇటీవల కాలంలో చిన్న వయసులోనే మతిమరుపు వస్తుంది.

ఇలాంటి వారిలో సూడో డిమాన్షియా ఉందని తాజా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. మీరు విన్నది నిజమే ఇది ప్రస్తుతం యువతను ఎక్కువగా బాధిస్తున్న సమస్య. అసలు సూడో డిమాన్షియా ఎందుకు వస్తుంది..? ఎలా వస్తుంది..? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తాజా అధ్యయనాల ప్రకారం సూడో డిమాన్షియా ప్రధాన కారణం అధిక ఒత్తిడి. మరో రకంగా చెప్పాలంటే ఇలాంటి బిజీ లైఫ్ లో పనులను చక్కబెట్టుకోవడానికి చాలా వ‌తిడికి గురవుతున్నారు జనం. మెదడుపై ఈ ఒత్తిడి ప్రభావం వల్లే మల్టీ టాస్కింగ్ చేయలేక స్ట్రెస్ కు గురవుతున్నారు. యువతలో ఇలాంటి సమస్యలు బాగా కనిపిస్తున్నాయి.

ఫలితంగా మానసిక ఒత్తిడి మెదడుపై ఎక్కువవుతుంది. ఇది మెదడుతో సంబంధం కలిగి ఉండడం. ఎందుకంటే కేవలం మతిమరుపు వల్లనే మెదడు క్షీణించ‌దు. అధిక ఒత్తిడి దీనికి ప్రధాన కారణంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. దీని ప్రభావం వల్లే మతిమరుపు అధిగా ఆలోచించడం డిప్రెషన్ లాంటి సమస్యలు తలెత్తుతాయట. గార్‌గావ్‌లో మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లోని న్యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ గుప్తా మాట్లాడుతూ ఇటీవల కాలంలో అధిక పని వతిడి కెరీర్ సంబంధిత ఒత్తిడి సామాజిక స్థితిలో గురించి ఆలోచనలతో మెదడుపై ఒత్తిడి పెంచుకుంటున్నారు.

ఇది సమాచారాన్ని ప్రాసెస్ చేయడంలో ఆటంకం కలిగిస్తుంది. ఫలితంగా శాశ్వతంగా గుర్తు పెట్టుకోవడం ఇబ్బందిగా అవుతుంది. మరోరకంగా చెప్పాలంటే మల్టీ టాస్క్ కూడా ఫోకస్ కోల్పోవడానికి కారణం. ఇలా మల్టీ టాస్కింగ్ పనుల వల్లే నేటి యువత తమకు తెలియకుండానే నకిలీ డెమెన్షియా వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మన మెదడు మూడు భాగాలుగా పనిచేస్తుంది. దీనిపై ఒత్తిడి పెరగడం కారణంగా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి.

ఏదో ఒకదానిపై దృష్టి పెట్టడం దాన్నే స్వీకరించడం దాన్ని అలాగే మెదడులోకి సేవ్ చేసుకోవడం ఈ ప్రతిపనికి మెదడు విడిగా పనిచేయవలసి ఉంటుంది. అధిక ఒత్తిడికి గురైనప్పుడల్లా సాధారణంగా మెదడు పనితీరు దెబ్బతింటూ వస్తుంది. కౌన్సిలింగ్ లేదా బిహేవియర్ తర్వాత ఈ సమస్యను అధిగమించడానికి ఉపయోగపడుతుంది. మీకు కూడా ఇలా చిన్న చిన్న విషయాలకు మతిమరుపు వస్తుంటే సాధారణ విషయంగా కొట్టి పారేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకోండి.