కృష్ణ వదిలేసిన ఆ సినిమా చిరుకి లైఫ్ ఇచ్చింది..!

గతంలో కృష్ణ చేయవలసిన సినిమా చిరంజీవి, చిరంజీవి చేయవలసిన సినిమా కృష్ణ చేయవలసి వచ్చిందట. అయితే ఆ రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇంతకీ ఏంటా సినిమాలు.. వారు ఎందుకు సినిమాలను మార్చుకోవాల్సి వచ్చిందో.. ఒకసారి తెలుసుకుందాం.

ఖైదీ :


1983లో డైరెక్టర్ కోదండరామిరెడ్డి హీరో కృష్ణనుకు ఖైదీ సినిమాకు సెలెక్ట్ చేసుకున్నారట. కథను కూడా వినిపించగా అప్పటికే కృష్ణ ఫుల్ బిజీగా ఉండడంతో కృష్ణ కోసం కొన్ని నెలలు వెయిట్ చేసి ఇక లాభం లేదని అదే కథను చిరంజీవికి వినిపించాడు. అప్పుడప్పుడు ఎదుగుతున్న చిరంజీవి ఆ సినిమాను ఓకే చెప్పడంతో అది కాస్త చిరు కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి చిరంజీవి సినీ జీవితాన్ని ఓ మంచి మలుపు తిప్పింది.

నెంబర్ వన్ :


1993లో ఎస్వీ కృష్ణారెడ్డి అన్నయ్య అనే సినిమా కథను చిరంజీవికి వినిపించాడు. చిరుకి స్టోరీ నచ్చింది కానీ తనను ఎస్ వి కృష్ణారెడ్డి ఎలా హ్యాండిల్ చేస్తాడు అని సందేహంతో ఈ సినిమాను వదులుకున్నాడట. కథ‌ కృష్ణకు చేరడంతో అప్పటికే వరుస ప్లాపులతో ఉన్న కృష్ణ ఈ ప్రాజెక్టుకు ఓకే చేశాడు. అన్నయ్య అనే టైటిల్ తో ఆల్రెడీ కృష్ణ సినిమా చేసి ఉండడంతో ఆ టైటిల్ నెంబర్ వన్ గా మార్చరట. ఇది కూడా సూపర్ హిట్గా నిలిచింది. అలా కృష్ణా వదిలేసిన ఆ సినిమా చిరుకి లైఫ్ ఇస్తే.. చిరు వదిలేసిన ఈ సినిమా కృష్ణకుమారికి త్రో బ్యాక్ ఎంట్రీ ఇచ్చింది.