బాడీ పెంచేందుకు ఇంజక్షన్ తీసుకున్నావ్ అంటూ గౌతమ్ కామెంట్స్…. కొట్టడానికి వెళ్లిన ప్రిన్స్….!!

బిగ్ బాస్ 7 రోజురోజుకు ఆసక్తిగా మారుతుంది. కంటెస్టెంట్లు గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే మరో టీమ్ చేస్తున్న పాలిటిక్స్ తో కొంతమందికి అన్యాయం జరుగుతుంది. కానీ బిగ్ బాస్ స్ట్రాటజీతో కంటెస్టెంట్ల మధ్య రచ్చ రచ్చ జరుగుతుంది. పవర్ అస్త్రాను సాధించుకునేందుకు మరో ముగ్గురు సిద్ధమయ్యారు. వీకెండ్ ఎపిసోడ్‌లో మరో హౌస్ మేట్ ఎవరో తేలిపోయింది. శివాజీ, అమర్ దీప్, షకీలా రేసులో ఉన్నారు. ఈ ముగ్గురు ఫైనాన్స్ కు వచ్చేందుకు జరిగిన పోటీలో గొడవలు ఘోరంగా జరిగాయి.

తాజా ఎపిసోడ్ మొదలవ్వడానికి ముందు ప్రిన్స్ యావర్, శివాజీ, షకీలా చేతిలో మాయాస్త్రాలు ఉన్నాయి. ఇందులో ఇద్దరినీ మాత్రమే పవర్ అస్త్రా కోసం ఎంపిక చేయాలి. చివరగా వచ్చిన గౌతమ్ సెలెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ప్రిన్స్ దగ్గర ఉన్న మాయస్త్రాన్ని తీసుకుని.. శివాజీ చేతిలో పెట్టాడు. శివాజీ టీం ను సరిగ్గా మేనేజ్ చేశాడని.. అందరితో ఆడించాడని కారణాలు చెప్పాడు గౌతమ్.

రెండు రెండు టాస్క్ ల్లో ఆడి.. గెలిపించినానని ప్రిన్స్ యావర్ చెప్పాడు. అమర్ దీప్ కూడా.. ఇది సరైన కారణం కాదని వెల్లడించాడు. మాయాస్త్రాన్ని ఇవ్వలేదు. కెమెరాల దగ్గరకు వెళ్లి.. న్యాయం కావాలంటూ అరిచాడు. గేట్స్ ఓపెన్ చేస్తే వెళ్లిపోతానని చెప్పుకొచ్చాడు. సరైన కారణం చెప్పి… తీసుకోవాలని గౌతంపై అరిచాడు ప్రిన్స్. అది సరైన కారణమే.. అంటూ గౌతమ్ కూడా తిరిగి అరిచాడు. ఇద్దరూ కోపంతో ఊగిపోయారు.

గట్టి గట్టిగా అరిచారు. ఎవరు చేతితో ఏదో సైగ చేసేందుకు ప్రయత్నించగా.. గౌతమ్ కూడా ఇంజక్షన్స్ చేస్తున్నట్టుగా సైగ చేశాడు. దీంతో యావర్‌కి మరింత కోపం వచ్చింది. నేను బాడీ పెంచేందుకు ఇంజక్షన్ తీసుకున్నానా అంటూ.. కోపంతో ఊగిపోయాడు. నువ్ చేశావా డబ్బులు ఇచ్చావా అంటూ అరుపులు మొదలుపెట్టాడు. ఇది కరెక్ట్ కాదు.. బిగ్ బాస్ నేను వెళ్లిపోతానని ఏడ్చాడు ప్రిన్స్. ఈ విషయాన్ని గౌతమ్ సమర్ధించుకున్నాడు. నేను డాక్టర్‌నే ఇంజక్షన్ తీసుకున్నట్టు నాకు తెలుసని చెప్పాడు. అమర్ దీప్ వెళ్లి… యావర్‌ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు.

శుభ శ్రీ సైతం యావర్ తో పర్సనల్ గా మాట్లాడింది. చాలామంది యావర్ కు చెప్పే ప్రయత్నం చేశారు. కష్టపడి ఆడానని.. అలా ఎలా తీసేస్తారని చెప్పుకొచ్చాడు ప్రిన్స్. మొత్తానికి కంటెస్టెంట్లు కన్విన్స్ చేయడంతో మాయాస్త్రాన్ని గౌతమ్ కృష్ణ చేతికి ఇచ్చాడు. అది తీసుకువెళ్లి.. శివాజీకి ఇచ్చాడు గౌతమ్. పవర్ అస్త్రా రేసు నుంచి తప్పుకున్నాడు ప్రిన్స్. బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ధైర్యం చెప్పాడు. తర్వాత కాస్త సెట్ అయ్యాడు.

పవర్ అస్త్ర కోసం పోటీ పడేందుకు మరో కంటెస్టెంట్ ను సెలెక్ట్ చేసే అవకాశాన్ని హౌస్ మేట్ సందీప్ కు ఇచ్చాడు బిగ్ బాస్. అమర్ దీప్ ను సెలెక్ట్ చేశాడు సందీప్. దీంతో పవర్ అస్త్రా కోసం శివాజీ, షకీలా, అమర్ దీప్ మధ్య పోటీ నెలకొంది. బిగ్ బాస్ చెవిలో గట్టిగా అరవాలని టాస్క్ ఇచ్చాడు. ఎవరైతే గట్టిగా అరుస్తారో వారికి పవర్ అస్త్ర రానుంది. మరి ఆ విన్నర్ ఎవరో వీకెండ్ ఎపిసోడ్లు తెలియనుంది.