మోటార్ స్పోర్ట్స్ అండ్ రేసింగ్‌లో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య..!

అక్కినేని నాగార్జున నటి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నాగ చైతన్య. ఎన్నో టాలీవుడ్ సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతన్యకు స్పోర్ట్స్ అంటే కూడా విపరీతమైన ఇష్టం. మోటార్ రేసింగ్ ఫ్రాంచైజ్‌ను ఇటీవల సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్‌ రేసింగ్ టీమ్ ను కొనుగోలు చేసిన చైతన్య మోటార్ రేసింగ్ టీంలో భాగంగా కావాలని ఎప్పటినుంచో ఎదురు చూశాడు.

ఇన్ని రోజులకు అతని కల నెరవేరింది. ఈ ఏడాది జరిగే ఫార్ములా ఫోర్ ఇండియన్ ఛాంపియన్షిప్ లో చైతు టీం రంగంలోకి దిగబోతుంది. నాగచైతన్య టీంకు అఖిల్ రవీంద్ర, నీల్ జానీ డ్రైవర్ వ్యవహరించబోతున్నారు. ఇండియన్ రేసింగ్ లీగ్ లో తొలి సంవత్సరంలో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ మంచి గ్రేస్ సంపాదించుకుంది. జట్టులో ఇద్దరు ప్రముఖ డ్రైవర్లు అఖిల్ రవీంద్ర, నీల్‌ జానీ డ్రైవర్స్ ఛాంపియన్షిప్ లో ఒకటి, రెండు ఫ్రెండ్స్ ని సంపాదించారు.

నిజానికి నాగచైతన్యకు కార్ రేసింగ్ అన్న, బైక్ రేసింగ్ అన్న చాలా ఇష్టం అలాగే కొత్త స్పోర్ట్స్ కార్ గాని స్పోర్ట్స్ బైక్ గాని మార్కెట్లోకి వచ్చిందంటే మొదటి కాల్ చైతన్యకే వస్తుందట. అతను డైరెక్ట్‌గా గ్యారేజ్ కి వెళ్లి దానిని కొనుగోలు చేస్తాడు. ఇక అక్కినేని అఖిల్‌కి క్రికెట్లో రాణించాలని ఆశ ఉండేదని మొదట్లో అఖిల్ టీమ్ ఇండియా కు రావాలని అనుకున్నాడట. ఇక ఏమైందో తెలియదు గానీ తర్వాత ట్రాక్ మార్చిన అఖిల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అన్నదమ్ములు ఇద్దరు ఇటీవల నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం నాగచైతన్య మరో సినిమాలో నటిస్తున్నాడు.