సైమా అవార్డ్స్ ఫంక్షన్‌లో సూపర్ క్యూట్ గా మెరిసిన శ్రీలీల.. పిక్స్ వైరల్…

ప్రముఖ టాలీవుడ్ నటి శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పెళ్లిసందడి’ సినిమాతో ఈ అమ్మడు తెలుగు తెరకు పరిచయమైంది . ఆ తరువాత రవితేజ తో కలిసి ‘ధమాకా’ సినిమా లో నటించ్చింది. ఈ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ చిన్నది. అతి తక్కువ సమయంలోనే బాగా పాపులారిటీ సంపాదించుకొని స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబు,పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రామ్ పోతినేని లాంటి స్టార్ హీరోల సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. అలానే ధమాకా సినిమాలో శ్రీ లీల తన డాన్స్ తో అందరిని ఒక ఊపు ఊపేసింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫిమేల్ డాన్సర్స్ లో ఒకరు గా పేరు తెచ్చుకుంది ఈ చిన్నది . శ్రీ లీల ఇండస్ట్రీ కి రాకముందు స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా రష్మిక, పూజా హెగ్డేలాంటి హీరోయిన్స్ కనిపించేవారు. అలాంటిది శ్రీలీల వచ్చి వాళ్ళందరిని పక్కకు నెట్టేసింది. ఆమె అందం, అభినయం, నటన, డాన్స్ చూస్తుంటే ఫ్యూచర్ లో శ్రీలీల టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఏలాడం ఖాయం అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గటుగానే శ్రీలీల వరుస అవకాశాలను దక్కించుకొని దుసుకుపోతుంది.ఇక తాజాగా ఈ అమ్మడు సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో మెరిసింది. దుబాయ్ లో ఎంతో అట్టహసంగా జరిగిన ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో శ్రీలీల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది.

 

 

2023 సైమా అవార్డ్స్ వేడుకలో మత్తేక్కించే ఆరంజ్ కలర్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. ఇదే శ్రీలీల హాజరైన మొదటి సైమా అవార్డ్స్ ఫంక్షన్ కావడం విశేషం. ఈ వేడుకకి శ్రీలీల తో పాటుగా దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, ప్రణీత సుభాష్ లతో పాటుగా పలువురు దక్షిణాది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో శ్రీలీల అందాలు చూసి అక్కడ ఉన్నవాళ్లంతా ఫిదా అవుతున్నారు. ఆరంజ్ కలర్ ఔట్ ఫిట్ లో చాలా క్యూట్ గా కనపడుతుంది ఈ చిన్నది. శ్రీలీల ఆరంజ్ ఔట్ ఫిట్ కి సంబందించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇక టాలీవుడ్ లో బాగా బిజీగా ఉన్న శ్రీలీల ఏకంగా 8 సినిమాలో నటిస్తుంది.