ఎన్టీఆర్ నుంచి పవన్ వరకు రెండు పెళ్లిళ్లు చేస్తున్న తెలుగు నటులు వీళ్లే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసుకోవడం తర్వాత విడాకులు తీసుకోవడం ఎంతో కామ‌న్ అయిపోపింది.రెండో పెళ్లి చేసుకోవడం కూడా అంతే కామన్ గా మారిపోయింది. అయితే బాలీవుడ్ లో ఎక్కువగా ఇలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కానీ మన టాలీవుడ్ లో కూడా అలాంటి కొంతమంది స్టార్ హీరోలు ఉన్నారు. అలా టాలీవుడ్ లో రెండో వివాహం చేసుకున్న నటినటులు ఎవరో ఒకసారి చూద్దాం.

Sr ఎన్టీఆర్:


నందమూరి తారకరామారావు 20 ఏళ్ల వయసులో మేనమామ కూతురు బసవతారకంను వివాహం చేసుకున్నాడు. 1985లో అనారోగ్య కారణంగా బసవతారకం మ‌ర‌ణించారు. కాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత ఎన్టీఆర్ 1993లో లక్ష్మీపార్వతిని రెండో వివాహం చేసుకున్నాడు.

కృష్ణంరాజు:


రెబల్ స్టార్ కృష్ణంరాజు మొదట సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించగా తర్వాత కృష్ణంరాజు శ్యామలాదేవిని వివాహం చేసుకున్నారు.

కమల్ హాసన్ :


టాలీవుడ్ లోనే కాక ఇతర పరిశ్రమల్లోనూ హీరోగా నటిస్తున్న విశ్వ నటుడు కమలహాసన్ మొదట వాణి గణపతి వివాహం చేసుకున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత సారికను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి శృతిహాసన్, అక్షర హాసన్ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఆ తర్వాత వీరిద్దరికి విడాకులు కమల్ గౌతమితో సహజీవనం చేశాడు. ప్రస్తుతం వీరిద్దరికి కూడా బ్రేకప్ అయ్యింది.

అక్కినేని నాగార్జున


నాగార్జున మొదటి దగ్గుపాటి లక్ష్మీని వివాహం చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇద్దరు మధ్యన అభిప్రాయ బేధాలతో విడిపోయారు. తర్వాత నాగ్ అమలను వివాహం చేసుకున్నాడు.

శరత్ బాబు :


ఈయన మొదటి సినిమా యాక్టర్ ర‌మా ప్రభను వివాహం చేసుకున్నాడు. తర్వాత వీరిద్దరి మధ్యన విభేదాల కారణంగా విడిపోయారు. అనంతరం స్నేహ‌ల‌త‌ను వివాహం చేసుకున్న శరత్ బాబు ఈమెకు కూడా విడాకులు ఇచ్చాడు.

ప్రకాష్ రాజ్


టాలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రకాష్ మొదట లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. వీరిద్దరూ విడిపోయారు తర్వాత ప్రకాష్ రాజు పోనీ వర్మను వివాహం చేసుకున్నాడు.

పవన్ కళ్యాణ్


మొదటి నందిని రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆమెతో విడాకులు ఇచ్చి 2005లో రేణు దేశాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కొంతకాలానికి పవన్ రేణు దేశాయితో విడాకులు తీసుకుని రష్య‌న్‌ నటి అన్న లెజ్‌నోవాని పెళ్లి చేసుకున్నాడు.