పెద కాపు-1 సినిమాకు చిక్కులు.. టైటిల్‌పై వివాదం

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో పెద కాపు-1 అనే సినిమా తెరకెక్కుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ సినిమాకు మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ఉన్నారు. ఆయన నిర్మాణంలో పెద కాపు 1 సినిమా తెరకెక్కుతోంది. రవీందర్ రెడ్డి బామర్థి విరాట్ కర్ణ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ఇందులో ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇప్పటికే ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చాలా డిఫరెంట్ గా ఉంది. సెప్టెంబర్ 29న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఈ సినిమాకు చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ సినిమా టైటిల్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక కులం పేరును సినిమా టైటిల్ గా పెట్టుకోవడంపై ఇబ్బందులు వస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో పెద్ద కాపు అంటే పెద్ద మనిషి అని అర్థం. కానీ కులం పేరు ఉండటంతో ఈ సినిమా టైటిల్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో టైటిల్ ను మార్చాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో టైటిల్ ను మార్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. శ్రీకాంత్ అడ్డాల ఏ ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టారనేది తెలియదు కానీ.. ప్రస్తుతం కుల సంఘాల నుంచి పేరు మార్చాలని డిమాండ్లు వస్తున్నాయి.

అటు సెన్సార్ సభ్యులు కూడా ఈ టైటిల్ పై అభ్యంతరాలు చెబుతున్నారు. తంలో జస్టిస్ చౌదరి, రాయలసీమ రామన్న చౌదరి, మాల పిల్ల, సమరసింహారెడ్డి అనే కులం పేర్లతో సినిమాలు వచ్చాయి. అలాగే క్షతియ పుత్రుడు అనే పేరుతో సినిమాలో వచ్చాయి. దీంతో ఇప్పుడు కాపు పేరును టైటిల్ లో పెడితే తప్పేంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.