మా నాన్న బలవంతంతోనే ఆ పాత్ర చేశా.. బోరున ఏడ్చిన సీనియర్ నటి..!!

సీనియర్ నటి జయలలిత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. క్లాసికల్ డాన్సర్ అయినా తాను.. సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్లు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె సినిమాలు అంటే ఇష్టం లేకుండానే అసలు ఈ ఫీల్డ్ లోకి ఎలా వచ్చింది. వ్యాంప్ క్యారెక్టర్లు ఎందుకు చేయాల్సి వచ్చింది? అనే పలు విషయాలు ప్రేక్షకులతో పంచుకుంది. జయలలిత మాట్లాడుతూ…” సప్తపది సినిమాల్లో సబిత క్యారెక్టర్.. అలాగే మయూరి సినిమాలో సుధా క్యారెక్టర్ కు ఫస్ట్ నన్నే సెలెక్ట్ చేశారు.

స్క్రీన్ టెస్ట్ కూడా అయిపోయింది. కానీ ఏవో కారణాల చేత ఆ పాత్రలు నా చెయ్యి జారిపోయాయి. ఇలా నన్ను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నాక కూడా చాలా పాత్రలు వెళ్లిపోయాయి. ఇక సినిమా మీద ఇంట్రెస్ట్ పోవడంతో 1983 లో డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌కి వచ్చాను. భరతనాట్యం, కూచిపూడి పూర్తిచేసిన తరువాత నటరాజ్ రామకృష్ణ దగ్గర ఆంధ్ర నాట్యం నేర్చుకుందామని వచ్చాను. దోమలగూడలో ఇన్స్టిట్యూట్ ఉండటంతో అక్కడే ఉండి నాట్యం నేర్చుకునేదాన్ని. అయితే నాన్న ఒకరోజు సడన్గా వచ్చి.. నా ఫ్రెండ్ మూవీ తీస్తున్నాడు. అందులో క్లాసికల్ డాన్సర్ కావాలట.. నువ్వు చెయ్యాలి అన్నారు. అయితే వెంటనే నా గదిలోకి వెళ్లి ఏడుస్తూ కూర్చున్నాను. నాకు సినిమాలు ఇష్టం లేదు.

రాను అని చెప్పిన వినలేదు. బలవంతంగా ఒప్పించారు. ఆ సినిమా పేరు ‘ ఈ పోరాటం మార్పు కోసం ‘. రేపల్లెలో షూటింగ్ జరిగింది. అక్కడ షూటింగ్ జరిగేటప్పుడు నిర్మాత ధనుంజయ రెడ్డి నన్ను చూశారు. ఈ అమ్మాయి బాగుంది చిరంజీవి ‘ ఖైదీ ‘ సినిమాలో క్యారెక్టర్ ఇవ్వాలి అన్నారు. నాన్నతో సంప్రదింపులు కూడా జరిపారు. కానీ.. చివరకు నేను చేయాల్సిన క్యారెక్టర్ సుమలత చేశారు. అలా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి వ్యాంప్ క్యారెక్టర్లు కూడా చేయాల్సి వచ్చింది ” అంటూ చెప్పుకొచ్చారు జయలలిత.