పవర్ఫుల్ మాస్ గ్యాంగ్ స్టార్ గా మహేష్ బాబు.. స్టొరీ ఇదే..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా ‘ గుంటూరు కారం’ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తుంది. ఎస్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. దీని అనంతరం ఎస్ఎస్ రాజమౌళితో భారీ పాన్ ఇండియా మూవీ SSMB 29 చేయనున్నాడు మహేష్ బాబు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ మూవీపై అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల అనంతరం సందీప్ రెడ్డి వంగతో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్‌లో 30వ సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు కోసం ఒక పవర్ఫుల్ స్టోరీ రాసుకున్నాను.. సరైన టైం వచ్చినప్పుడు దానిని పట్టాలెక్కిస్తాం అంటూ గతంలో దర్శకుడు సందీప్ రెడ్డి పలు ఇంటర్వ్యూలో తెలిపాడు.

అయితే అసలు విషయం ఏమిటంటే.. ఈ మూవీలో మహేష్ పవర్ ఫుల్ మాస్ గ్యాంగ్ స్టార్ రోల్ చేయనున్నారట. సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునేలా ఈ స్టోరీ అద్భుతంగా సిద్ధం చేశారట దర్శకుడు. ఒకవేళ ఇదే నిజమైతే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇదే సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. మరి ఈ న్యూస్ లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.