దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు కెవి. రెడ్డి బ్యాక్‌గ్రౌండ్… ఆయ‌న హిస్ట‌రీ ఇదే…!

సినిమాలు తీయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుందని.. దానికి ఒక శాస్త్రం ఉంటుందని చెప్పి ఆ విధానాన్ని నిరూపించిన డైరెక్టర్, ప్రొడ్యూసర్, గొప్ప మేధావి కె.వి.రెడ్డి. సరైన స్క్రిప్ట్‌ సినిమాకు అవసరమని. సరైన విధంగా స్క్రిప్ట్ పూర్తి చేస్తే సినిమా మూడింతలు పూర్తయినట్లేనని నిరూపించాడు. దక్షిణ భారతదేశ దర్శకుల్లో అగ్రగ‌న్యల్లో ఒకడిగా కె.వి రెడ్డి నిలిచాడు. మూడు దశాబ్దాల టైంలో కేవలం ఆయన 14 సినిమాలు మాత్రమే రూపొందించాడు. తెలుగు హిందీ వర్షన్ లో కలిపితే మొత్తం 18 సినిమాలకు దర్శకత్వం వహించిన కే.వి.రెడ్డి 5 పౌరాణిక, 4 జాపద, 3 సాంఘిక, 2 చారిత్రాత్మక సినిమాలను రూపొందించాడు.

ఇక కె.వి.రెడ్డి పేరు చెప్పగానే టక్కున మనకు గుర్తుకు వచ్చేది మాయాబజార్, పాతాళభైరవి, గుణసుందరి, దొంగ రాముడు ఈ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. 1837లో తన మిత్రుడు మూల నారాయణస్వామి భాగస్వామిగా ఉన్న రోహిణి పిక్చర్స్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరాడు కే.వి.రెడ్డి. అప్పట్లో రోహిణి పిక్చర్స్ హెచ్ఎం రెడ్డి దర్శకత్వంలో గృహలక్ష్మి సినిమా జరుగుతుండగా అదే టైంలో బి.ఎన్.రెడ్డి సముద్రాల నాగరెడ్డి తో పరిచయం ఏర్పడింది. వీరంతా బయటకు వచ్చి వాహిని పిక్చర్స్ ని స్థాపించారు. ఆ బ్యానర్ పై బి.ఎన్.రెడ్డి తీసిన వందేమాతరం, సుమంగళీ, దేవత సినిమాలకు కె.వి.రెడ్డి సహాయ దర్శకుడిగా వ్యవహరించాడు.

దేవత తర్వాత కె.వి.రెడ్డికి స్వయంగా దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. అదే అతని మొదటి సినిమా భక్త పోతనతో సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకున్న ఆయన.. తర్వాత గుణసుందరి కథతో మంచి తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో పాతాళ‌ భైరవి సినిమాను రూపొందించాడు. తర్వాత మాయాబజార్ ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త చరిత్రను సృష్టించింది. కే.వీ దర్శకత్వ‌ ప్రతిభకు పకడ్బందీ స్క్రీన్ ప్లేకు ఈ సినిమా తిరుగులేని ఎగ్జాంపుల్‌గా చెప్పవచ్చు. ఇక 1912 జులై 1న అనంతపురం జిల్లా తాడిపత్రిలో జన్మించిన కే. వీ. రెడ్డి 1972 సెప్టెంబర్ 15న కన్నుమూశాడు. ఆయన చనిపోయి ఇంత కాలమైనా ఆయన సినిమాలతో చిరంజీవిగా కొట్లాదిమంది ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.