మామిడి ఆకులతో తెల్ల జుట్టు నల్లగా .. ఎలా వాడాలంటే..?

ఈమధ్య చాలామంది చిన్న వయసులోనే త‌ల‌ మెరిసిపోయి తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మామిడి ఆకులు కూడా చాలా బాగా సహాయపడతాయి. మామిడి ఆకులను ఆయుర్వేదంలో ఎక్కువగా యూజ్‌ చేస్తూ ఉంటారు. ఈ ఆకులలో ఎవరు ఊహించని ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పైగా మామిడి ఆకులు చాలా సులువుగా దొరుకుతాయి. జుట్టుకి సంబంధించిన సమస్యలను తగ్గించడానికి మామిడి ఆకులు మంచి ఔషధంలా పనిచేస్తాయి.

ఈ ఆకులను శుభ్రంగా కడిగి ఎండలో పెట్టి మెత్తని పొడిగా చేసి నిల్వ ఉంచుకుని చాలా రోజులు వాడుకోవచ్చు. పొయ్యి వెలిగించి ఓ గిన్నె పెట్టి గ్లాసు నీటిని పోసి కాస్త వేడయ్యాక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, టేబుల్ స్పూన్ టీ పౌడర్, టేబుల్ స్పూన్ ఎండిన ఉసిరికాయ ముక్కలు వేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఐరన్ కడాయి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల మామిడి ఆకుల పొడి, మూడు టేబుల్ స్పూన్ల హెన్నా పొడి వేసి ముందుగా తయారుచేసి పెట్టుకున్న నీటిని పోసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ఒక గంట పాటు అలా వదిలేసి ఆ తర్వాత జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి ఒక గంట వ‌దిలేయాలి. త‌ర్వాత‌ తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. ఈ చిట్కా జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాలు ఫాలో అయ్యి తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడవచ్చు. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.