SSMB -29 లో బాలయ్య బ్యూటీ.. లక్ కలిసోచ్చేనా..?

బాలకృష్ణ ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు.. ఇక ఆయన సినిమాలలో ఎన్నోసార్లు నటించిన హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. లెజెండ్ సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది..ఆ తర్వాత బాలకృష్ణతో కలిసి డిటెక్టర్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది… అయితే సోనాల్ అందాలకు మంచి మార్కులు పడ్డాయి..

Bollywood babe roped in for Mahesh-Rajamouli film - TeluguBulletin.com

అలాగే బాలయ్యతో ముచ్చటగా మూడోసారి కూడా నటించింది ఈ చిత్రమే రూలర్.. నా బాలయ్యకు మూడు సినిమాలలో నటించిన ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజీ సంపాదించింది..F -3 సినిమాలో కూడా కొన్ని నిమిషాల పాటు అలరించిన ఈ ముద్దుగుమ్మ స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది. అయితే ఈ సినిమాలో పెద్దగా గుర్తింపు రాలేదు చివరిగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆదిపరుష్ చిత్రంలో కూడా రావణుడు భార్యగా కనిపించింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఇప్పుడు ఇది ఇంత ఇలా ఉంటే ఒక క్రేజీ ఆఫర్ ఈ అమ్మడి కి వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. మహేష్ బాబు నటిస్తున్న రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఫిలిం సినిమాలో ఈమెకు అవకాశం వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో సోనాల్ చౌహాన్ కనిపించబోతున్నట్లు సమాచారం. మరి రాజమౌళి సినిమా కావడంతో సోనాల్ చౌహాన్ కూడా వెంటనే ఓకే చెప్పినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ నటిస్తూ ఉంటే ఈ సినిమాతో ఈమె కేరియర్ మారుతుందని అభిమానుల సైతం భావిస్తున్నారు.