రేటు పెంచిన నాగార్జున‌.. `నా సామి రంగ‌` మూవీకి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ కింగ్‌, అక్కినేని మ‌న్మ‌థుడు ఎట్ట‌కేల‌కు తన 99వ సినిమాను అనౌన్స్ చేశారు. నాగార్జున బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ మూవీపై అప్డేట్ వ‌చ్చింది. ప్రసన్న కుమార్ బెజవాడ అందించిన క‌థ‌తో ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున త‌న త‌దుప‌రి సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీకి `నా సామి రంగ‌` అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను లాక్ చేశారు.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ఎంఎం కీరవాణి స్వ‌రాలు అందిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి పండ‌గ కానుక‌గా ఈ సినిమా విడుద‌ల కానుంది. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. రీసెంట్ గా బ‌య‌ట‌కు వ‌చ్చిన టైటిల్ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ ల‌భించింది. ఈ గ్లింప్స్ వీడియోలో నాగార్జున లుంగీ కట్టులో, బీడీ కాలుస్తూ మాస్ లుక్ లో అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు.

గ్లింప్స్ తో సినిమాపై అంచ‌నాలు పెంచేశారు. అయితే ఈ సినిమాకు నాగార్జున రెమ్యునరేష‌న్ కూడా గ‌ట్టిగానే ఛార్జ్ చేస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత‌కు ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల కంటే లోపే తీసుకున్న నాగార్జున‌.. ఆ సారి మాత్రం రేటు పెంచార‌ట‌. నా సామి రంగ మూవీ కోసం రూ. 20 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడ‌ని ఇన్‌సైడ్ టాక్ న‌డుస్తోంది. అన్న‌ట్లు ఈ సినిమాలో హీరోయిన్‌, ఇతర నటీనటులు ఎవ‌రు అన్న‌ది మేక‌ర్స్ అనౌన్స్ చేయ‌లేదు. కానీ, కాజ‌ల్ అగ‌ర్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.