సినిమాలు లేక ప‌వ‌న్ హీరోయిన్ దేవ‌యాని ఎలా బ‌తుకుతుందో తెలుసా..!

దేవయాణి అంటే ఎక్కువమందికి తెలియకపోయినా పవన్ కళ్యాణ్ కెరీర్‌ర్ లో సూపర్ హిట్ సినిమా అయినా సుస్వాగతం సినిమాలో హీరోయిన్ అంటే అందరికీ ఇట్టే గుర్తుకొచ్చేస్తుంది. ఆ సినిమాలో ఎంతో సింపుల్ గా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమున్నా..లేనట్టుగా అస్సలు సినిమా అంతా తండ్రికి భయపడే ఒక మధ్య తరగతి అమ్మాయిగా. ఈమె నటన అద్భుతమనే చెప్పాలి. ఇక ఆ సినిమా తర్వాత ఈమె తెలుగులో ఎక్కువగా కనిపించలేదు. 1993లో బెంగాలీ సినిమాతో మొదలైన ఈమె సినిమా ప్రయాణం తరవాత తమిళ్ లో బాగా బిజీ అయిపోయింది.

ఈమె అన్ని భాషల్లో కలిపి ఇప్పటివరకు 90 సినిమాల్లో నటించింది. అలాగే 7 సీరియల్స్ లో కూడా నటించింది. ఇక మన తెలుగులో దేవయాణి కొన్ని సినిమాల్లోనే నటించినా అందరికి గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది.సుస్వాగతంలో అమాయకురాలైన అమ్మాయిలా, నాని సినిమాలో మహేష్ బాబుకి అమ్మలా, చెన్నకేశవరెడ్డి లో పవర్ఫుల్ అన్నయ్యకు చెల్లెలిలా, జనతాగ్యారేజ్, అరవింద సమేత సినిమాల్లో ఎన్టీఆర్ కి అమ్మలా నటించి అందరిని మెప్పించింది. అయితే ఈమెకి అందరి హీరోయిన్స్‌లా కాకుండా ఒక ప్రత్యేకత ఉంది అది ఏంటంటే.. ముంబైలో పుట్టిన దేవయాణి అసలు పేరు సుష్మ.

ఈమె కెరీర్ మొత్తం ట్రెడిషనల్‌గానే కనిపించి ఎంతో మంది కల‌ల దేవతగా మారింది. ఈమె తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుండగానే దర్శకుడు రాజ్ కుమార్‌ని ప్రేమించి ఇంట్లో తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఈమెకి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వారి పేరు ఇనియా, ప్రియాంక. ఈమె కెరీర్‌లో ఎదుగుతున్న సమయంలోనే దర్శకుడు రాజ్ ని పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత పిల్లల్ని కనడం. వారితో టైం స్పెండ్ చేయడంతో ఈమె కెరీర్ ముగిసిపోయింది.ఈమె సినిమాలకు దూరమై ప్ర‌స్తుతం అవ‌కాశాలు లేక‌ స్కూల్లో టీచర్‌గా కూడా పనిచేసింది.