అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటా.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఓపెన్ కామెంట్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌త కొద్ది రోజుల నుంచి `ఖుషి` మూవీ ప్ర‌మోష‌న్స్ లో ఎంత బిజీగా ఉన్నాడో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. స‌మంత అమెరికాలో ఉండ‌టంతో.. బ్యాక్ టు బ్యాక్ ఇంట‌ర్వ్యూలు, ప్రెస్ మీట్స్ అంటూ విజ‌య్ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపాడు. ఈ క్ర‌మంలోనే సినిమా విశేషాల‌తో పాటు వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా పంచుకున్నాడు.

అలాగే పెళ్లి మ‌రియు త‌న‌కు కాబోయే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో వివ‌రించాడు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పెళ్లి ప్ర‌స్తావ‌న రాగా.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. పెళ్లెప్పుడు చేసుకోవాల‌నిపిస్తే అప్పుడు చేసుకుంటాను. అయితే నాకు సంబంధించి అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకునే తెలివైన అమ్మాయి నా లైఫ్ పార్ట్‌న‌ర్‌గా రావాలి. అలాంటి అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను.

ఇక నా పెళ్లి పెద్ద హ‌డావుడి లేకుండా ప్ర‌శాంతంగా జ‌ర‌గ‌డ‌మే నాకు ఇష్టం` అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ చెప్పుకొచ్చాడు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి. కాగా, నేడు విడుద‌లైన ఖుషి మూవీకి పాజిటివ్ టాక్ ల‌భించింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మూవీకి బాగా క‌నెక్ట్ అవుతున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత‌ల‌కు హిట్ ఖాయ‌మ‌ని అంటున్నారు.