పాకిస్థాన్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా సంచ‌ల‌నం.. ఇదేం మాస్ ర‌చ్చ రా బాబు!

పవ‌న్ క‌ళ్యాణ్, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తొలిసారి క‌లిసి న‌టించిన `బ్రో` ఇటీవ‌ల గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ సూప‌ర్ హిట్ వినోద‌య సిత్తంకు రీమేక్ ఇది. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న బ్రో.. జూలై 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే మొద‌టి ఆట నుంచే బ్రో సినిమా నెగ‌టివ్ టాక్ ను ముట‌గ‌ట్టుకుంది.

అయినా కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఉన్న క్రేజ్‌, ఇమేజ్ కార‌ణంగా.. బాక్సాఫీస్ వ‌ద్ద మొద‌టి వారం 70 శాతం వ‌సూళ్ల‌ను రిక‌వ‌రీ చేసింది. కానీ, ఫుల్ ర‌న్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ కాలేక‌పోయింది. దీంతో ఆల‌స్యం చేయ‌కుండా బ్రోను ఓటీటీలోకి దించేశారు. ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో బ్రో సినిమాను తెలుగుతో పాటు త‌మిళ్, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోకి డ‌బ్ చేసి అందుబాటులో తెచ్చారు.

అయితే థియేట‌ర్స్ లో బోల్తా ప‌డ్డ బ్రో.. ఓటీటీలో దుమ్ము లేపుతోంది. ఇండియాలోనే కాదు పాకిస్థాన్‌, బాంగ్లాదేశ్ వంటి దేశాల్లో బ్రో సినిమా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో బ్రో మూవీ తెలుగు మరియు హిందీ వెర్షన్స్ టాప్ 2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. పాకిస్థాన్, బాంగ్లాదేశ్ వంటి ప్రాంతాల్లో టాప్ 8 స్థానం లో బ్రో నిలిచి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇక ఓవరాల్ గా నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రం టాప్ 7 స్థానం లో కొనసాగుతుంది. ఇండియాకు శ‌త్రువు దేశ‌మైన పాకిస్థాన్ లో ఒక తెలుగు ఫ్లాప్ సినిమాను ఇంత‌లా ఆధ‌రించ‌డం చూసి అంద‌రూ షాకైపోతున్నారు.