ప్చ్: రెబల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..ప్రభాస్ ‘సలార్’ వాయిదా?.. కొత్త తేదీ ఎప్పుడంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ..ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “సలార్”. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఏ న్యూస్ రిలీజ్ అయినా సరే క్షణాలలోనే వైరల్గా మారిపోతూ ఉంటుంది . కాగా ఈ సినిమాతో మరొక క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్న ప్రభాస్ ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డాడు అని ఇప్పటివరకు రిలీజైన అప్డేట్స్ ఆధారంగా తెలిసిపోతుంది.

ప్రభాస్ ఈ సినిమా ద్వారా హిట్ కొడితే చూడాలి అంటూ కూడా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . కానీ అలాంటి ఫ్యాన్స్ కు ఇది బాడ్ న్యూస్ అనే చెప్పాలి. సెప్టెంబర్ 28న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వాల్సిన ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది . సలార్ సినిమా షూట్ ఇంకా కంప్లీట్ అవ్వని కారణంగా ..ప్రభాస్ కాళ్లకి జరిగిన సర్జరీ కారణంగా ఆయన హెల్త్ కండిషన్ బాగోలేకపోవడం వల్లే.. ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలుస్తుంది .

అంతేకాదు డిసెంబర్ ఆఖరి వారంలో కానీ డిసెంబర్ 15వ తేదీ కానీ ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో కొత్త రిలీజ్ డేట్ వైరల్ అవుతుంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు . బాహుబలి సినిమా తర్వాత సరైన హిట్ లేని ప్రభాస్ ఈ సినిమాతోనైనా సూపర్ డూపర్ హిట్ అందుకుంటాడు అని ఆశపడుతున్నామని కానీ మేకర్స్ లాస్ట్ మూమెంట్లో ఇలా హ్యాండ్ ఇవ్వడం బాధగా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో సలార్ సినిమాకి సంబంధించిన ఈ న్యూస్ సెకండ్స్ లోనే వైరల్ గా మారింది..!!