మీ నోట్లో ఈ లక్షణాలు కనిపిస్తే మీకు డయాబెటిస్ ఉన్నట్టే..!

ప్ర‌స్తుత కాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. తరచూ మన బిజి షెడ్యూల్‌తో లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లపై ప‌టులేక‌ ఇలాంటి సమస్యల బారిన పడుతున్నాం. రోజురోజుకీ డయాబెటిస్‌తో ఇబ్బంది పడే వారి సంఖ్య ఎక్కువ అవుతూనే ఉంది. అయితే కొందరు ఈ వ్యాధి లక్షణాలను గుర్తించలేక మరింత క్రిటికల్ పొజిషన్‌కి తెచ్చుకుంటున్నారు. దీంతో వీరు తీవ్ర అస్వస్థత‌కు గురవుతున్నారు. చాలామంది షుగర్ వ్యాధి అనగానే తరచు మూత్రం విసర్జన, నీరసం, ఆకలి అలసట వంటి లక్షణాల ద్వారా గుర్తిస్తారు. కానీ మన నోరు చూసి కూడా మనం షుగర్ వ్యాధితో బాధపడుతున్నామో లేదో చెప్పవచ్చు.

తరచూ నోరు ఎండిపోతుంటే టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారని అర్థం. అలాగే నాలిక పొడి భారి పెదాలు కూడా తరచుగా పగులుతూ ఉంటాయి. నోట్లో పుండ్లు వంటి వాటితో పాటు మింగడం మాట్లాడడం నమ‌లడం కూడా కష్టతరమైపోతుంది. అలాగే చిగుర్లు సమస్యలు కూడా తలెత్తుతాయి. చిగుళ్ల వాపులు చిగుళ్ళ నుండి రక్తం కారడం చిగుళ్ళు నొప్పిగా ఉండడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. అదే విధంగా షుగర్ వ్యాధితో బాధపడే వారిని నోటి దుర్వాసన ఎక్కువగా ఉంటుంది. దంతాలు కూడా వదులుగా తయారవుతాయి. అంతేకాకుండా దంతాలు ఊడిపోయే ప్రమాదం కూడా ఉంది.

మధుమేహంతో బాధపడే వారిలో ఈ నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మన నోటిని చూసి మనం టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్నామో చెప్పేయవచ్చట. ఈ లక్షణాలు కనిపించడం వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించి తగిన రక్త పరీక్షలు చేయించుకోవాలి. డయాబెటిస్ ను అసలు నిర్లక్ష్యం చేయవద్దు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో బీటా కణాలు దెబ్బతింటాయి. అలాగే శరీరం డిహైడ్రేట్ అవ్వడం, కంటి సమస్యలు, మూత్రపిండాల పనితీరు మందగించ‌డం, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

అలాగే రక్తనాళాలు దెబ్బతినడం గుండెపోటు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుని సంప్రదించాలి. క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఉండాలి. దంత వైద్యని సంప్రదించి దంతాలకు పరీక్ష చేయించుకుంటే మంచిది. ఈ విధంగా షుగర్ వ్యాధిని ప్రారంభ దశలో ఉన్నప్పుడే గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే మరింత తీవ్ర అనారోగ్యానికి గురి కాకుండా మనం మనల్ని కాపాడుకోవచ్చు.