#Bagawanth kesari: గ‌ణేష్ ఏన్త‌మ్ పాట‌కి మాస్ స్టెపుల‌తో అద‌ర‌కొట్టిన బాల‌య్య, శ్రీ‌లీలా..(వీడియో)

ప్రస్తుతం నందమూరి నట‌సింహం బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీలీలా కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైన‌ర్‌గా రూపొందుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవ‌ల‌ రెండు వరుసహిట్లను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ఈ సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ ను సొంతం చేసుకుంటాడని బాలయ్య ఫ్యాన్స్ ఘ‌టిగా న‌మ్ముతున్నారు.

Bhagwant kesari | గీసారి మోత మోగిపోయే అప్‌డేట్‌.. భగవంత్‌ కేసరి ఫస్ట్ సింగిల్‌ టైం ఫిక్స్‌

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్, టీజర్ రిలీజ్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత్త మోగించింది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా బాలయ్య హిట్ కొట్టడం ఖాయం అనే విధంగా సినిమా టీజర్ ని రూపొందించాడు అనిల్ రావిపూడి. అయితే ఇవాళ సాయంత్రం 4:05కు రావలసిన భగవంత్ కేసరి ఫస్ట్ సాంగ్ మూవీ టీం లేట్ చేశారు. గణపతి రాకకు సన్నాహాలు జరుగుతున్నాయి.. మరికొంత సేపు వేచి ఉండండి అనే ట్యాగ్ తో 5:41 కి రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక చాలా సేపు వెయిటింగ్ త‌ర్వ‌త తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ #Ganesh Anthem రిలీజ్ అయింది.

Bhagavanth Kesari | బాలయ్య పాటల ప్రచారం షురూ | Bhagavanth Kesari's First  song from tomorrow

అదరగొట్టే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో బాలయ్య, శ్రీ లీల వేసిన స్టెప్స్ ఫాన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా ఉన్నాయి. ఫుల్ ఆఫ్ మాస్ సాంగ్ గా ఈ పాట రూపొందించారు. 5నిమిషాల 3 సెక‌న్లు సాగే ఈ పాట‌కి బాలయ్య, శ్రీ లీల ఊర మాస్ స్టెపుల‌తో అద‌ర‌గొట్టారు. ఈ పాట‌తో అవీల్‌ ప్రేక్ష‌కుల‌లో మ‌రిన్ని అంచ‌నాలు పెంచాడ‌నే చెప్పాలి.