అలా చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. “దేవరకొండ” బ్రదర్స్ కి కలిసొచ్చిన లక్కి డైలాగ్ ఇదే..!!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు స్టార్స్. ఆ హీరోయిన్ తో నటిస్తే సినిమా హిట్ అవుతుందని ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటిస్తే సినిమా బాగా సక్సెస్ అవుతుందని భావిస్తూ ఉంటారు . కొందరు పలాన ముహూర్తం రోజే సినిమాను స్టార్ట్ చేయాలని.. పలానా రోజే ఈ సినిమాని రిలీజ్ చేయాలని ఎక్కువగా సెంటిమెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు. అలాగే ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ క్రేజీ సెంటిమెంట్ వైరల్ గా మారింది.

విజయ్ దేవరకొండ మార్క్ డైలాగ్ ” ఆ పిల్ల నాది” అనే డైలాగ్ ఏ సినిమాలో చెప్తే ఆ సినిమా హిట్ అయిపోతుంది అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాతో ఈ డైలాగ్ హైలైట్ గా మారింది . ఆ తర్వాత విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ సైతం బేబీ సినిమా లో ఈ డైలాగ్ ని వాడారు. ఈ సినిమా ఎంతటి అయ్యిందో మనం చూశాం. ఆ తర్వాత మళ్లీ విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో ఈ డైలాగ్ ను వాడారు .

“ఆ పిల్ల నాది” అనే డైలాగ్ తనదైన స్టైల్ లో చెప్పారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు విజయ్ దేవరకొండ బ్రదర్స్ కి ఈ డైలాగ్ బాగా కలిసొచ్చిందని .. ఆ పిల్ల నాది అనే డైలాగ్ చెప్తే సినిమా హిట్ అయిపోతుంది అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . చూడాలి మరి నెక్స్ట్ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ ఆ డైలాగ్ వాడుతారో లేదో..?