ఎన్టీఆర్ మూవీ మేనియాలో కొట్టుకుపోయిన చిరంజీవి సినిమా ఏంటో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా కోసం ఒక టాలీవుడ్ ఏ కాదు మొత్తం యావత్ ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. ఇక పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్‌గా అద్భుతమైన నటన కనబరిచిన‌ ఎన్టీఆర్ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ బ్లాక్ పాస్టర్ హిట్ అందుకుంది. అయితే రాజమౌళి – ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1. 27 సెప్టెంబర్ 2001న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షో తోనే సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. ఎం. ఎం కీరవాణి సంగీతంతో రూపొందిన పాటలు అన్నీ కూడా హిట్ అయ్యాయి. ఈ సినిమా 42 కేంద్రాల్లో 100 రోజులు ఆడి రికార్డ్స్ సృష్టించింది. అయితే అప్పుడే విడుదలైన మెగాస్టార్ చిరంజీవి డాడీ మూవీ మాత్రం స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో నిలవలేకపోయింది.

మొద‌ట యావరేజ్ టాక్ అందుకున్న ఈ మూవీ.. ఎన్టీఆర్ సినిమా దూసుకుపోవడంతో ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. డాడీ మూవీ ని ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. అప్పట్లో విడుదలైన ఈ సినిమా రాజమౌళికి మొదటి సినిమా కావడం విశేషం. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్న రాజమౌళి అప్పటినుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ అనేది లేకుండా కొనసాగుతున్నాడు.