భార్య బర్తడే కి బన్నీ స్పెషల్ గిఫ్ట్.. పాన్ ఇండియా హీరో అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ కి తన భార్య స్నేహారెడ్డి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు పిల్లలతో లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది . స్నేహ తన పనుల్లో తాను బిజీగా ఉంటే .. పుష్ప2 సినిమా షూట్ లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు . కాగా నేడు స్నేహ పుట్టినరోజు .. అందుకే సినిమా కాల్ షీట్స్ అన్ని హోల్డ్ లో పెట్టి మరి భార్యను తీసుకొని లండాన్ కి భార్యని తీసుకొని వెళ్ళిపోయాడు.

బన్నీ తన ఇన్స్టా స్టోరీలో లండన్ అంటూ ఓ పిక్చర్ ని పోస్ట్ చేశారు . ఈ ఫోటోలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా చాలా స్టైలిష్ గా ఉన్నాడు . ఆ తర్వాత తన భార్య బర్త్డ డే కు హ్యాపీ బర్త్డ డే క్యూటీ అంటూ తన భార్యతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు . ఈ ఫోటో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది .

 

దీంతో హ్యాపీ బర్త్డే వదినమ్మ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు బన్నీ స్నేహ రెడ్డికి డైమండ్ రింగ్ గిఫ్ట్ చేసినట్లు కూడా సన్నిహితుల దగ్గర నుంచి సమాచారం అందుతుంది. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది . అంతే కాదు వీళ్లిద్దరు ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటూ దీవిస్తున్నారు.