విజయ్ సినిమాని కాదని..ఆ హీరోకి కాల్ షీట్స్ ఇచ్చిన శ్రీలీల..పెద్ద తప్పే చేసిందిగా..!!

శ్రీలీల ..విజయ్ దేవరకొండను బకరా చేసిందా..? అంటే అవునని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో శ్రీలీల టూ ఓవర్ యాక్టింగ్ ఎక్కువగా చేస్తుంది అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే విజయ్ దేవరకొండ తో సినిమాను యాక్సెప్ట్ చేసింది శ్రీలీల. విజయ్ తిన్నూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల సెలెక్ట్ అయింది .

అయితే ఏమైందో ఏమో కానీ లాస్ట్ మినిట్లో అమ్మడు హ్యాండ్ ఇచ్చి నేను ఈ సినిమాలో చేయలేను అంటూ చెప్పుకొచ్చిందట . దీంతో హీరోయిన్గా రష్మిక మందన్నాను చూస్ చేసుకున్నారు మేకర్స్. అయితే అలా రష్మికను చూస్ చేసుకున్నారో లేదో ఇలా అమ్మడు వేరే సినిమాకు కమిట్ అయిందట . ఆ సినిమా మరేదో కాదు దేవర . ఎన్టీఆర్ కెరియర్ లోనే ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలకు ఛాన్స్ వచ్చిందట .

దీంతో వదులుకోవడం ఇష్టం లేక యాక్సెప్ట్ చేసిందట అమ్మడు. అదే కాల్ షీట్ విజయ్ దేవరకొండ అడిగితే లేవు అని దేవరకు మాత్రం ఎలా వచ్చాయని ఫాన్స్ మండిపడుతున్నారు . అయితే ఇవన్నీ కన్నడ పిల్ల తెలివితేటలని .. విజయ్ దేవరకొండతో సినిమా చేయడం కన్నా ఎన్టీఆర్ తో చేస్తే క్రేజ్ ఎక్కువగా వస్తుందని భావించి ఇలాంటి డెసిషన్ తీసుకుందేమో అంటూ ఫ్యాన్స్ ఫన్నీగా కౌంటర్స్ వస్తున్నారు..!!