ఎన్టీఆర్ ఔదార్యాన్ని ఒక్క మాటలో చెప్పిన శివన్న.. కామెంట్స్ వైరల్..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం తెలియాలి అంటే ఆయనను దగ్గర్నుంచి చూసిన వాళ్లే చెప్పాలి. ముఖ్యంగా ఆయన మంచి మనసును ఎవరైనా సరే ఇట్టే త్వరగా అర్థం చేసుకుంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని జూనియర్ ఎన్టీఆర్ గొప్పతనం గురించి ఒక్కమాటలో వెల్లడించారు.

ప్రస్తుతం శివరాజ్ కుమార్ నటించిన ది గోస్ట్ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటిస్తూ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాన్ని తెలియజేశారు. ఇక అందులో భాగంగానే మహేష్ బాబు తో దిగిన ఫోటో గురించి అడుగుతూ.. మహేష్ బాబు తో దిగిన ఫోటో గుర్తుందా అనే ప్రశ్నకు శివరాజ్ కుమార్ స్పందిస్తూ ఆయనది విశాల హృదయము.. మహేష్ బాబు ప్రొఫెషనల్ , డిగ్నిఫైడ్ అంటూ తెలిపారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఆయనది ఒక విశాలమైన హృదయం.. కన్నడలో మాట్లాడాలంటే మంచి మనసు, విశాల హృదయం ఖచ్చితంగా ఉండాలి. ఆ రెండు తారక్ కు ఉన్నాయి. కన్నడలో మాతో మాట్లాడడమే కాదు పాట కూడా పాడాడు అంటూ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టం అని.. తన ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ ను ఎంతగానో ప్రేమిస్తోందని ఆయన తెలిపారు. మొత్తానికైతే శివరాజ్ కుమార్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.