ధోనీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన ప్రముఖ హీరో ఏమన్నాడంటే…

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గురించి పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆయన ‘ ఘోస్ట్ ‘ అనే సినిమా లో నటిస్తున్నాడు. ఈ యాక్షన్ ఏంటర్టైన్మెంట్ సినిమా అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రాభోతుంది. శివరాజ్ కుమార్ నటించిన ‘ ఘోస్ట్ ‘ సినిమా పై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. శ్రీని దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం శివరాజ్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అందుకే ఈ సినిమా గురించి భారీగా ప్రమోషన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు శివన్న. ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో కూడా ప్రమోట్ చేస్తున్నారు. శివరాజ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో ‘ ఆస్క్ శివ రాజ్ కుమార్ ‘ అనే సెషన్ నిర్వహిస్తాడు. దాంతో శివన్న అభిమానులు రకరకాల ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు శివన్న తన స్టైల్ లో సమాధానం చెప్పాడు. ‘ కెప్టెన్ మిల్లర్ ‘ సినిమా గురించి చెప్పండి అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు శివన్న సమాధానం చెప్తూ ‘ మొతం టీమ్ తో కలిసి పనిచెయ్యడం చాలా హ్యాపీ గా ఉంది. ఇక ధనుష్ కలిసి వర్క్ చెయ్యడం ఇంకా ఆనందం గా ఉంది. ‘ అని చెప్పాడు.

ఇక ధోని గురించి ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు శివన్న స్పందిస్తూ ‘ నిజానికి ధోని సరిగా మాట్లాడాడు కానీ అతని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. ఒక క్రికెట్ అభిమానిగా నేను అతని కెప్టెన్సీ ని ఎప్పుడు ఇష్టపడతాను. కానీ మనిషిగా అతను కష్టాలను ఎదుర్కొంటూ ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. అది నాకు ఇంకా ఎక్కువగా నచ్చుతుంది’ అని చెప్తాడు.