రజనీకాంత్ కు తప్పని ఇబ్బందులు.. ఆ స్ట్రెస్‌కి కారణం అదేనట..!!

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారని ఎన్నో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ముందుగా రావాలని అనుకున్న అక్కడున్న పరిస్థితులు, ఆయన ఆరోగ్య రిత్యా రాజకీయాలకు దూరంగా ఉండటమే మంచిదని నిర్ణయం తీసుకున్నాడు. అందుకే పార్టీ అనౌన్స్ చేసినప్పటికీ తర్వాత సారీ చెప్పి హ్యాండ్ ఇచ్చాడు. దాంతో ఈయన పాలిటిక్స్ పూర్తిగా దూరమైనట్లే అని అంతా ఫిక్స్ అయ్యారు.

కానీ అది అంత ఈజీ కాదని రజనీకాంత్ కు ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది. రజని రాజకీయాలకు ఎంత దూరంగా ఉన్న ఆయన రమ్మని ఆహ్వానాలు ఆగటం లేదు. ఈమధ్య గవర్నర్ పోస్ట్ ఇస్తున్నారంటూ వార్తలు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఓ పార్టీకి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు అంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ వీటన్నిటికీ దూరంగా ఉండడానికి రజిని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడట. సినిమా మార్గం ఎంచుకోవడానికి కూడా కారణం అదేనట.

గతంలో సినిమాలకు రజనీకాంత్ గుడ్ బై చెప్పాలనుకున్నాడని అయితే ఈ రాజకీయ ఒత్తిడిని భరించలేని కారణంగానే సినిమాలకు దగ్గరయ్యాడనే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన ఆరోగ్య రీత్యా సినిమాలకు కూడా గుడ్ బై చెప్పాలని రజిని భావించారట. దానికి తోడు ఆయనకు సరైన బ్లాక్ బాస్టర్ కూడా రాలేదు. కాగా ఇక ఆ రాజకీయాల ఒత్తిడి నుంచి తప్పుకోవడానికి సినిమాల్లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన రజినీ జైలర్ తో ఏకంగా రూ.800 కోట్ల వసూళ్లను దక్కించుకొని స్ట్రాంగ్ త్రో బ్యాక్ ఇచ్చాడు. దీంతో వరుస‌ సినిమాల అవకాశాలు అందుకుంటున్నాడు.

ఇక ఇటీవల జ్ఞానువేలతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజిని ఈ సినిమా సెట్స్‌ పైకి రాకముందే లోకేష్ కనగ‌రాజన్‌తో సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పాడు. ఇక లోకేష్ కనకరాజు సినిమాతో రజనీకాంత్ సినిమాలు క్లోజ్ అయిపోతాయి. రజిని సినిమాలకు రాజీనామా చేస్తాడంటూ న్యూస్ వైరల్ అయింది. ఇంతలోనే జైలర్ 2 ఉందనే క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు నిల్సన్‌. ఈ సినిమాకు ముందుగానే అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట రజిని. కనుక రాజకీయ ఒత్తిడి తప్పించుకోవడానికి రజనీ సినిమాలలో బిజీ అవుతున్నాడని న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.