మజాక్‌లు చేయ‌డానికి నేనెవ‌ర్రా బాయ్‌.. ర‌తిక‌ను చెప్పు తీసుకుని కొట్ట‌మ‌న్న రైతు బిడ్డ‌..!

ప్రస్తుతం బిగ్ బాస్ 7 ప్రేక్షకుల అంచనాలకు మించి రసవక్తంగా దూసుకుపోతుంది. మూడో వారం సింగర్ దామిని ఎలిమినేట్ అవ్వగా… సోమవారం నామినేషన్సు షురూ చేశాడు బిగ్ బాస్. ఈ క్రమంలోని నామినేషన్ లో హౌస్ మేట్స్ మధ్య హోరా హోరీగా గొడవలు జరిగాయి. ఇక ఇందులో భాగంగా పల్లవి ప్రశాంత్.. గౌతమ్ ని నామినేట్ చేస్తూ ” అమ్మాయి అరిచినప్పుడు నువ్వు అరు.

కానీ అలా షర్ట్ విప్పడం నాకు నచ్చలేదు ” అని రీజన్ చెప్పాడు. దానికి గౌతమ్ ” నువ్వు రతికను ఏంటి ఈ పొట్టి పొట్టి బట్టలు ” అని అన్నావ్ అన్నాడు. అయితే నేను దోస్తాలో అన్నా అని ప్రశాంత్ అనగా… నేను ఏం బట్టలు వేసుకుంటే నీకెందుకు అంటూ రతిక ప్రశాంత్ పై సీరియస్ అయింది. మరి నువ్వు నా దగ్గరకు వచ్చి గిట్ల గిట్ల అని ఎందుకు చెప్పావు అంటూ ప్రశాంత్ సీరియస్ అయ్యాడు.

ఇలా వీరిద్దరి డిస్కషన్ అవుతుండగా… నా ప్రాపర్టీ అని ఎందుకు అన్నావని రతిక ప్రశాంత్ ని అడగగా…. ఏదో మజాక్ లో అన్న అని చెప్పాడు ప్రశాంత్. దీంతో రతిక నాతో మజాట్లు చేయడానికి నేను ఎవర్ర బాయ్ నీకు అంటూ ప్రశాంత్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది రతిక. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.