మహేశ్ కు మరో బొక్క..గుంటూరు కారం నుండి ఆ హీరోయిన్ అవుట్..ఎందుకంటే..?

పాపం ఏమని స్టార్ట్ చేశారో తెలియదు కానీ గుంటూరు కారం సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక అవంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి . గుంటూరు కారం సినిమా ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో తెలియదు కానీ .. అప్పటినుంచి సినిమాకి సంబంధించి ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అది నెగిటివ్గా మారడం జరుగుతూనే వచ్చింది. ఈ సినిమాలో మొదటి హీరోయిన్గా పూజ హెగ్డేను అనుకున్నారు.

కానీ కొన్ని కారణాల చేత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది .. ఆ తర్వాత పలువురు టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకునేశారు. దీంతో గుంటూరు కారం సినిమా రిజల్ట్ పై అభిమానులకు ఎక్కడో తేడా కొట్టింది . అయితే రీసెంట్గా ఈ సినిమాలో కీలకపాత్రలో నటించడానికి ఒప్పుకున్న కాజల్ సైతం తప్పుకున్నట్లు తెలుస్తుంది. దానికి కారణం త్రివిక్రమ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఒకలాగా..

సీన్ తెరకెక్కించేటప్పుడు ఆమెను మరీ టూ ఓల్డ్ క్యారెక్టర్ లో చూపించడానికి సిద్ధపడ్డారట. దీంతో ఒకే ఒక్క రోజు షూటింగ్ కి అటెండ్ అయిన కాజల్ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ఆ సినిమాకి తీసుకున్న డబ్బులను సైతం వెనక్కి ఇచ్చేసిందట . సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!