జాన్వీ కపూర్ రెండో తెలుగు సినిమా డీటెయిల్స్ వచ్చేసాయోచ్..ఆ హీరోతోనే..!!

ఫైనల్లీ .. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ అనుకున్నది సాధించినట్లే కనిపిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా కానీ ఆమెకు ఫేవరెట్ హీరోగా ఎవరు అని అడగ్గానే విజయ్ దేవరకొండ పేరు చెప్పిన జాన్వి కపూర్ .. ఆ హీరోతో తన సెకండ్ సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది . విజయ్ దేవరకొండ విజయ్ తిన్నూరు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే .

ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీలను అనుకున్నారు . అయితే కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేని కారణంగా శ్రీ లీల ఈ సినిమా నుంచి తప్పుకుందట . ఈ ప్లేస్ లోకి రష్మిక మందన్నాను తీసుకొచ్చారు అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మంచి స్పైసి బజ్ రావాలంటే..

ఖచ్చితంగా హాట్ బ్యూటీ ఉండాలి అని దానికోసమే విజయ్ దేవరకొండను ఎంతో ఇష్టంగా లైక్ చేసే జాన్వీ కపూర్ అయితే బాగుంటుంది అంటూ విజయ్ తిన్నూరి స్పెషల్ గా బోనీకపూర్ ని రిక్వెస్ట్ చేసి మరి ఈ ఆఫర్ ను ఆమెకు ఇచ్చారట . జాన్వి కపూర్ కి విజయ్ దేవరకొండ అంటే ఎంత ఇష్టమో బోనీ కపూర్ కి తెలుసు .. అందుకే ఈ సినిమా యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుందట..!!