రాజమౌళి సినిమాకు ముందే ఆ హిట్ డైరెక్ట‌ర్‌తో మ‌హేష్ మూవీ..!

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మూవీ ” గుంటూరు కారం “. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా కంప్లీట్ అవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత అయితే మహేష్ నుంచి అవైటెడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ రాజమౌళి తో సినిమా చేయనున్న సంగతి మనందరికీ తెలిసిందే.

మరి ఈ సినిమా మహేష్ కెరియర్ లో 29వ సినిమా కాగా.. ఇప్పుడు సాలిడ్ బజ్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే… రాజమౌళి తో సినిమా కన్నా ముందే మరో డైరెక్టర్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు అయితే ఈ సినిమా లాక్ చేసినట్టుగా స్ట్రాంగ్ బజ్ మొదలైంది.

మరి ఈ సినిమా డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు. అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే మ‌హేష్ 29వ సినిమా ఉండొచ్చని సమాచారం. ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ క్లారిటీ వస్తే కానీ తెలియదు. గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే.