సప్త సాగరాలు దాటి.. మూవీ రివ్యూ..

కోలీవుడ్ స్టార్ హీరో రక్షిత్ శెట్టి హీరోగా కవ‌లుదారి ఫేమ్ హేమంత్ ఏం రావు డైరెక్షన్లో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించిన మూవీ సప్తసాగర దాచే ఏల్లో ఈ మూవీ కన్నడ చిత్ర సినిమాలో సంచలనాన్ని సృష్టించింది. సెప్టెంబర్ 1న కన్నడ భాషలో రిలీజ్ అయిన ఈ మూవీ కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగులో అనువాద రూపంలో ఈ సినిమాని రిలీజ్ చేసింది. ప్యూర్ లవ్ స్టోరీ గా రూపొందింది.

క‌థ‌
ఈ మూవీలో (రక్షిత్ శెట్టి) మను, (రుక్మిణి వసంత్) ప్రియ అనే ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకుంటారు ఓ గొప్ప ఇంట్లో డ్రైవర్గా మను వర్క్ చేస్తూ ఉంటాడు. కాలేజీలో చదువుకుంటూనే మంచి సింగర్ అవ్వాలని ప్రియ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. సరదాగా పాటలు, ప్రయాణాలతో సజావుగా సాగుతున్న వీరి లవ్ లైఫ్ డబ్బు కోసం మనూ చేసిన ఒక పని కారణంగా చల్లా చదిరవుతుంది. ఇంతకీ మను ఏం తప్పు చేశాడు..? మనూని రక్షించడానికి ప్రియా ఏం చేసింది..? వాళ్ళిద్దరూ మల్లి కలిసారా లేదా..? అనేది ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు డైరెక్టర్.

రక్షిత్ శెట్టి నటన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు కానీ ఈ సినిమాలో హీరోయిన్ రుక్మిణి వసంత్ కూడా అతని మించి నటించింది. రక్షిత పడే బాధ రుక్మిణి కాళ్ళలో క్లియర్ గా కనిపిస్తుంది. ఒక స్వచ్ఛమైన ప్రేమికురాలు అంటే ఇలాగే ఉండాలి అనే విధంగా ఆమె తన నటనతో సత్తా చాటింది. అలాగే రక్షిత్ శెట్టి కళ్ళలోని బాధను ప్రతి ప్రేక్షకుడు అనుభూతి చెందే విధంగా ఈ సినిమా రూపొందింది. ఓ సగటు ప్రేమికుడికి అతని హావభావాలు మనసుకు హత్తుకునే విధంగా ఉన్నాయి. వంటరి తల్లి పాత్రలో పవిత్ర లోకేష్, నెగటివ్ రోల్ లో అచ్యుత్ కుమార్ నటించారు.

రివ్యూ
కొన్ని ప్రేమకథలు సంతోషాన్ని, ఇంకొన్ని సంతృప్తిని కలిగిస్తాయి. కానీ అది కొద్ది సినిమాలు మాత్రమే ప్రేక్షకుల గుండెలను హత్తుకు పోయే విధంగా ఉంటాయి. బాధను మించిన అగాధంలోకి తీసుకువెళ్తాయి 1986 నిరీక్షణ తర్వాత.. ఆ స్థాయిలో ప్రేక్షకులు పిండేసే స్వచ్ఛమైన ప్రేమ కథగా ఈ సినిమాను చెప్పుకోవచ్చు. ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ సినిమాను కచ్చితంగా చూడాలి.