పసుపు నూనెతో అద్భుతమైన సౌందర్యం.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..?

చర్మం ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. అందానికి వివిధ రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ ను మనం వాడుతూ ఉంటాం. కానీ చాలామందికి పసుపు నూనె అంటే ఏంటో తెలియదు. దీని వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. పసుపు మొక్క వేళ్ళ నుంచి తీసిన అత్యవసర నూనె వల్ల కూడా సౌందర్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇక దీనితో మొటిమలు కురుల‌ సమస్య నుంచి కూడా ఉపసమ‌నం లభిస్తుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి.

చ‌ర్మంలో సిబ‌మ్‌ పెరగడం వల్ల చర్మంపై ఎక్కువ నూనె ఉత్పతై చ‌ర్మం జిడుగా మారుతుంది. తద్వారా మొకంపై మొటిమలు, మచ్చలు ఏర్పడుతుంటాయి. సిబ‌మ్‌ ఉత్పత్తిని క్రమబద్ధీకరించి జిడ్డుదనాన్ని తొలగించడంలో పసుపులోనే ముఖ్యపాత్ర వహిస్తుంది. దీనివల్ల మొటిమలు బెడద ఉండదు. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు చర్మానికి తేమని అందించి పొడి చర్మ సమస్యను దూరం చేస్తాయి. ముఖంపై ముడతలు, గీతలు రాకుండా చేసి నవయువనంగా ఉంచాలంటే ఈ నూనె చాలా సహకరిస్తుంది. అదే విషయంగా కురులకు ఈ ఎసెన్షియల్ ఆయిల్ వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.

చాలామంది చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు.చుండ్రు నివారించడమే కాదు జుట్టు రాలడాన్ని కూడా అరికట్టడంలో ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉండడం వల్ల ఇవి కుదుళ్లలో ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతాయి. దీనికోసం మీరు నేరుగా కాకుండా మనం ఉపయోగించే సాధారణ కొబ్బరి నూనెలో కొన్ని చుక్కలు మాత్రమే కలుపుకొని ఉపయోగించాలి. ఈ నూనెలో యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు.. ఏదైనా సమస్య వల్ల వాపు నొప్పి వస్తే వాటి నుంచి ఉపశమనం పొందానికి కూడా సహాయపడుతుంది. పాదాల్లో పగుళ్లను తగ్గించడానికి కూడా ఇది బాగా సహకరిస్తుంది.

దీనికోసం కొబ్బరి నూనె లేదా ఆమదంలో రెండు చుక్కలు ఎసెన్షియ‌ల్‌ ఆయిల్ కలిపి రోజు పాదాలకు మృదువుగా మర్దన చేసుకోండి. ఇలా చేయడం వల్ల తక్కువ టైం లోనే పగుళ్లు తగ్గడంతో పాటు పాదాలు చాలా మృదువుగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ మైక్రో బియల్ గుణాలు చర్మ సంబంధిత వ్యాధులను కూడా రాకుండా చేస్తాయి. కొన్ని రకాల మచ్చలను నివారించే సౌందర్య ఉత్పత్తుల్లో కూడా ఈ పసుపునూనెను వాడుతారు..