లోకేష్ పాదయాత్ర రీస్టార్ట్..బ్రాహ్మణి ఎంట్రీ అక్కడే.!

లోకేష్ యువగళం పాదయాత్ర మళ్ళీ మొదలుకానుంది. ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో అక్కడ నుంచే మళ్ళీ పునః ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో లోకేష్ రాజోలులో పాదయాత్ర చేస్తూ మధ్యలోనే ఆపేశారు. ఇక తన తండ్రి కేసులకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. అయితే న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది..కానీ బాబు ఇంకా బయటకు రాలేదు.

ఇప్పటికీ ఆయన కేసులు వ్యవహారం ముందుకెళుతూనే ఉంది. అయితే న్యాయ పోరాటం కొనసాగిస్తూనే..పార్టీ పరమైన విషయాల్లో కూడా దూకుడు పెంచాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే బాబు అరెస్ట్ తో పార్టీ కార్యక్రమాలు నడవడం లేదు. దీంతో ఇకపై పార్టీ కార్యక్రమాలపై ఫుల్ గా ఫోకస్ పెట్టనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పోలిటికల్ యాక్షన్ కమిటీని కూడా నియమించారు.  ఇక బాబు ఆదేశాల మేరకు పార్టీలో కార్యక్రమాల నిర్వహణ కోసం పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమిస్తూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, ఎంఏ షరీఫ్, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనంద్ బాబు, కాల్వ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్ధన్ రెడ్డి, వంగలపూడి అనిత, బీద రవిచంద్ర యాదవ్ నియమితులయ్యారు.

త్వరలోనే లోకేష్ పాదయాత్ర కూడా మొదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే లోకేష్‌ని సైతం అరెస్ట్ చేస్తారనే ప్రచారం వస్తుంది. ఈ తరుణంలో లోకేష్ గాని అరెస్ట్ అయితే బ్రాహ్మణి పాదయాత్ర చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె రాజమండ్రిలోనే ఉన్నారు. టి‌డి‌పి నేతలతో ఎప్పటికప్పుడు సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్‌ని గాని అరెస్ట్ చేస్తే బ్రాహ్మణి పాదయాత్ర చేస్తారని అంటున్నారు.