డైరెక్ట‌ర్ వినాయ‌క్‌కి బాల‌య్య పెట్టిన ముద్దు పేరు ఇదే.. ఇలా కూడా పిలుస్తారా..!

నందమూరి బాలకృష్ణ ఓ సినిమాకు ఓకే చెప్పారంటే ఆ సినిమా సెట్స్ లో నిర్మాతతో మొదలుపెట్టి దర్శకుడు టెక్నీషియన్స్ ఆ సినిమాకు పని చేసే కార్మికులతో సహా అందరిని ఒకే విధంగా గౌరవిస్తారు. నిర్మాతలు అన్నవారు లేకపోతే సినిమానే ఉండదు అని ఇండస్ట్రీలో సినిమా చేసేవారు ఉండరు అంటూ బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్న విషయం. అందుకే నిర్మాతలతో పాటు సినిమాకు ప్రాణం పోసే ప్రతి ఒక్క శ్రామికుడిని బాలయ్య ఒకే విధంగా గౌరవిస్తాడు. బాలయ్య ఎవరిని అగౌరవంగా మాట్లాడడం త‌క్కువ‌గా చూడ‌టం జ‌ర‌గ‌దు.

ఇక బాలయ్య ఓసారి కథ విని ఓకే చేసిన తర్వాత దర్శకుడు చెప్పిన కథలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయమని సజెస్ట్ చేయడ‌ట. డైరెక్టర్ ఏది చెబితే అదే చేస్తాడు. ఇప్పడు టాలీవుడ్ లో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు మాకే అంతా తెలుసు అన్నట్లు ఉంటూ తర్వాత రోజు షూట్ చేయబోయే సీన్ గురించి డైరెక్టర్ చెప్పిన వినకుండా దానిని మార్చమంటూ వారిపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అలా మార్చి తెర‌కెక్కించిన సినిమాలు కొంతవరకు సక్సెస్ అయినప్పటికీ చాలా సినిమాలు వరకు ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇక వీవీ వినాయక్ – బాలయ్య కాంబినేషన్లో చెన్నకేశవరెడ్డి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో వివి వినాయక్ చెప్పిన విధంగా బాలయ్య నటించాడు. ఇందులో బాలయ్య పంచ కట్టు, మీసం కట్టు, ఆయన డైలాగ్ డెలివరీ ఎంతో చక్కగా వచ్చాయి. ఈ సినిమా ప్రేక్షకుల్లో అంతగా సక్సెస్ సాధించకపోయినప్పటికీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కు మంచి లాభాలే తెచ్చిపెట్టింది. ఆ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడకపోయినా వివి వినాయక్- బాలయ్యను ఎప్పుడు కలిసిన సినిమా సూపర్ హిట్ కాలేదని నువ్వేం ఫీల్ కాకమ్మ నేను మాత్రం సినిమాను బాగా ఎంజాయ్ చేశాను.. నీకు నాతో ఎప్పుడు సినిమా చేయాలనిపించిన కథ రెడీ చేసుకుని వచ్చేయ్ అని చెప్పేవాడట.

అలాగే వినయక్‌ ఎప్పుడు కలిసిన ముందు ఏం సత్తిరెడ్డి అంటూ సరదాగా ఆటపట్టించేవాడట. అలా చెన్నకేశవరెడ్డి సినిమాలో డైలాగ్ పెట్టి వివి వినాయకుని పిలవడం బాలయ్యకు అలవాటైందట. ఇక వినాయక్ రూపొందించిన‌ ఇంటెలిజెంట్ సినిమా తర్వాత సి .కళ్యాణ్ బ్యానర్ లో బాలయ్యతో రెండవ సినిమా తెర‌కెక్కించాలనుకున్నాడట వినాయక్. కానీ సరైన కథ రెడీ కాకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమయింది.