కొత్త బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన దిశా పటాని..!!

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలెంటెడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తో గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఏడాది కిందటే బ్రేకప్ చెప్పేసింది అంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి..అక్కడితో ఆగకుండా తాజాగా టైగర్ ష్రాఫ్ ఫిట్నెస్ కోచ్ అయినా అలెగ్జాండర్ అలెక్సిలిక్ తో డేటింగ్ చేస్తోందంటూ ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు పలుసార్లు తన స్నేహితుడు అంటూ అలెక్స్ ని దిశ పటాని స్వయంగా పరిచయం చేయడంతో ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్ గా మారింది.

Disha Patani moves on from her breakup with Tiger Shroff, confirms  relationship with Aleksander; introduces him as her boyfriend in this viral  video

ఇదిలా ఉండగా గత రాత్రి మరొకసారి ఈ ముద్దుగుమ్మ తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో కెమెరా కంటికి చిక్కడం మరొక సంచలన వార్త అని చెప్పాలి. వాస్తవానికి తన స్నేహితురాళ్లతో తన ప్రియుడు అని పరిచయం చేస్తూ కనిపించింది ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో నిజంగానే ఆమె తన ప్రియుడు అంటూ పరిచయం చేయడం మనకు స్పష్టంగా ఆ వీడియోలో కనిపిస్తోందని చెప్పవచ్చు. ఇకపోతే దిశ అలెక్స్ నిరంతరం జంటగా హీటెక్కించే ఫోటోలతో రకరకాల భంగిమలలో ఫోటోలు షేర్ చేస్తూ ఉండడంతో నిజంగానే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి మరి ఈ ఫోటోలు చూసిన తర్వాత టైగర్ ష్రాఫ్ ఏ విధంగా స్పందిస్తాడో అన్నది మరింత ఉత్కంఠగా మారింది. ఇకపోతే దిశ టైగర్ ష్రాఫ్ విడిపోయారంటూ కొన్ని నెలల క్రితం హెడ్ లైన్స్ లో కథనాలు వచ్చిన వీరిద్దరూ దీనిపై స్పందించలేదు.

WATCH: Disha Patani Introduces Aleksandar Ilic As Her 'Boyfriend' In  Public, Video Goes Viral

ముఖ్యంగా టైగర్ ష్రాఫ్ ని దిశ ఏకపక్షంగా ప్రేమించిందని అతడు ఆమెను కేవలం స్నేహితురాలుగా మాత్రమే భావించాడని వార్తలు వచ్చినా అది అభిమానులకు షాకింగ్ గానే మారింది. ఎప్పుడు కూడా వీరు బహిరంగంగా ప్రేమించుకుంటున్నట్లు బయట చెప్పలేదు. ఇక ఇప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్ నీ పరిచయం చేయడంతో టైగర్ ష్రాఫ్ తో తనకు ఎలాంటి రిలేషన్ లేదని స్పష్టం అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)