టాలీవుడ్‌ను నష్టాల‌తో ముంచేసిన ప‌ర‌మ వ‌ర‌స్ట్ సినిమాలు ఇవే..!

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రతి ఏడాది ఎన్నో వందల సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో కేవలం సగంలోసగం కూడా పూర్తిస్థాయిలో పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకురావడం లేదు. ఇక డబల్ ప్రాఫిట్స్ అందించిన మూవీస్ అయితే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఇటీవల కాలంలో చాలా సినిమాలు భారీ స్థాయిలోనే నష్టాలను మిగులుస్తున్నాయి. ఈ నేప‌ద్యంలో ప్రేక్షకుల అంచనాలని అందుకోవడం మామూలు విషయం కాదు. మినిమమ్ కంటెంట్అయినా ఉంటేనే ఆడియన్స్ థియేటర్స్ వద్దకు వస్తున్నారు.

ఈ రోజుల్లో సక్సెస్ అయిన సినిమాల రికార్డుల కంటే కూడా డిజాస్టర్ అయిన సినిమాలు ఎక్కువ స్థాయిలో రికార్డ్ అందుకుంటున్నాయి. ఇక లిస్ట్ ప్రకారం అయితే ఇప్పటివరకు అత్యధిక స్థాయిలో నష్టపోయిన సినిమాల లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అందులో ప్రభాస్ ఆదిపురిష్ సినిమా కూడా టాప్ లిస్టులో ఉందని చెబుతున్నారు. సినిమాలకు పెట్టుబడి గట్టిగా పెడుతున్నప్పటికీ కూడా దానికి తగ్గట్టు డబ్బులు వెనక్కి రావడం లేదు. ఇక బ్రహ్మాస్త్ర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.400 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అందుకుందని బాగానే హడావిడి చేశారు.

కానీ ఆ సినిమా ద్వారా దాదాపు రూ.200 కోట్లు రేంజ్‌లోనే నష్టాలు మిగిల్చిందట. ఇక ఆదుపురుష్ మూవీ రూ.550 కోట్లు వరకు ఖర్చు చేశారని టాక్ వినిపించింది. అయితే ఈ సినిమా ప్రపంచ స్థాయిలో రూ.350 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. అంటే దాదాపు రూ.220 కోట్లు స్థాయిలోనే నష్టాలు మిగిల్చిందని సమాచారం. ఇక ప్రభాస్ కెరీర్‌లోనే ఇది పెద్ద డిజాస్టర్. అలాగే పెట్టిన పెట్టుబడికి రాదే శ్యామ్ సినిమా కూడా దాదాపు రూ.170 కోట్ల వరకు నష్టాలని మిగిల్చింది. నార్త్ ఇండియాలోనే కాకుండా సౌత్ ఇండియాలో కూడా కొన్ని సినిమాలు పెట్టిన పెట్టుబడికి అత్యధిక స్థాయిలో నష్టపోయాయి.

ఇక అందులో సామ్రాట్ పృధ్విరాజ్ సినిమా ద్వారా రూ.140 కోట్లు నష్టం కలుగగా.. షంషేరా సినిమా రూ.100 కోట్లు పోగొట్టుకుంది. ఇక తెలుగు సినిమా లు విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ద్వారా రూ.80 కోట్ల వరకు నష్టాలు రాగా కన్నడ ఫిలిం కబ్జా అయితే రూ.80 కోట్ల వరకు నష్టాల్ని మిగిల్చింది. ఇక అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా రూ.70 కోట్లు, తగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా రూ.60 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.