అందరి ముందు విలేఖ‌రిని చెప్పుతో కొట్టిన వాణిశ్రీ….. అసలు కారణం ఇదే….!!

ఈ మధ్యకాలంలో చాలా వరకు సోషల్ మీడియాలో హీరో, హీరోయిన్స్ విషయంలో అలాగే ఎన్నో ఎఫైర్స్ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ తీరు ఇప్పటినుంచే కాదు గత కొన్ని ఏళ్ల నుంచి వస్తుంది. అప్పట్లో కూడా చాలామంది వెబ్సైట్, పత్రిక వాళ్లు హీరో హీరోయిన్స్ పర్సనల్ విషయాలు గురించి బహిరంగంగానే రాసేవారట. ఇక అప్పట్లో ఉండే ఒక ప్రముఖ పత్రిక చాలామంది హీరో, హీరోయిన్ల వ్యక్తిగత విషయాల్లో లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్లు రాసేవారట.

కేవలం వారి జీవితం మీదే కాకుండా వారికి సంబంధించిన అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఇలా ప్రతి ఒక్కరి మీద వివాదాస్పద వ్యాఖ్యలు రాసేవారు. అయితే ఈ వార్తలను చూసి అప్పటి హీరోయిన్ వాణిశ్రీ చాలా నవ్వుకునేదట. ఇదే విషయం వాణిశ్రీ జీవితంలో కూడా ఒకసారి జరిగిందట. ఈమె చెల్లి గురించి తల్లి గురించి ఆ పేపర్ వాళ్లు చాలా అసభ్యంగా రాసేవారట. అయినా హీరోయిన్ వాణిశ్రీ ఇలాంటి చెడు వార్తలను పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోయేదట.

కానీ ఆ పేపర్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ గురించి మీ ఫ్యామిలీ గురించి ఇలా తప్పుడు వార్తలు రాయకుండా ఉండాలంటే నాకు మీరు రూ.10వేల ఇవ్వాలి అని అడిగాడట. దానికి ఎంతో కోప్పడ్డ వాణిశ్రీ ఓకే నండి ఇస్తా రేపు షూటింగ్ సెట్ కి రండి అని చెప్పిందట. ఇక ఉదయాన్నే ఆ వ్యక్తి డబ్బులు తీసుకోవడానికి వాణిశ్రీ దగ్గరికి వస్తే నీ చెల్లి, తల్లి గురించి ఇలాంటి వార్తలే రాస్తారా అంటూ అందరి ముందే చెప్పుతో కొట్టిందట. దాంతో ఆ వ్యక్తి భయపడి ఇంటికి పరుగు తీసాడట. ఇలా వాణిశ్రీ ఏ విషయంలో అయినా కఠినంగా వ్యవహరించేవారట.